E-Paper
Advertisement

Kilauea Volcano: వేయి అడుగుల ఎత్తుకు ఎగిసిన లావా.. నిప్పులు చిమ్మిన అగ్నిపర్వతం

Kilauea Volcano: వేయి అడుగుల ఎత్తుకు ఎగిసిన లావా..  నిప్పులు చిమ్మిన అగ్నిపర్వతం
Advertisement

Kilauea Volcano: హవాయిలోని కిలౌయా అగ్నిపర్వతం మరోసారి ఉగ్రరూపం దాల్చింది. మంగళవారం ఉదయం ప్రారంభమైన తాజా విస్ఫోటనం కారణంగా లావా ఆకాశంలోకి సుమారు 1,000 అడుగుల ఎత్తుకు ఎగిసిపడింది. దీనివల్ల భారీగా బూడిదతో పాటు గాజు వంటి శిలా శకలాలు (Tephra) రహదారులపై పడటంతో హవాయి అగ్నిపర్వతాల జాతీయ పార్కును తాత్కాలికంగా మూసివేశారు. అలాగే ద్వీపంలోని అత్యంత కీలకమైన హైవే 11ను కూడా అధికారులు పాక్షికంగా మూసివేసి ప్రయాణికులను అప్రమత్తం చేశారు.

డిసెంబర్ 2024లో ప్రారంభమైన ఈ అగ్నిపర్వత విస్ఫోటనం గత ఏడాది కాలంగా ఆన్-అండ్-ఆఫ్ పద్ధతిలో కొనసాగుతోంది. మంగళవారం నాటి ఘటన ఈ విస్ఫోటన క్రమంలో 43వ ఎపిసోడ్ కావడం గమనార్హం. ప్రస్తుతం అగ్నిపర్వతం నుంచి రెండు ప్రదేశాల్లో ఎర్రటి లావా సెగలు ఎగిసిపడుతున్నట్లు లైవ్ స్ట్రీమింగ్ దృశ్యాల్లో కనిపిస్తోంది. గత నవంబర్‌లో జరిగిన విస్ఫోటనం ఎంత భీకరంగా ఉందంటే.. అప్పట్లో వెలువడిన లావా ప్రతి 5.5 సెకన్లకు ఒక ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్‌ను నింపేంత భారీ స్థాయిలో ఉంది.

Advertisement

అదృష్టవశాత్తూ ఈ లావా ప్రవాహం కిలౌయా శిఖరంలోని క్రేటర్ (Crater) లోపలే పరిమితమై ఉంది. దీనివల్ల సమీపంలోని నివాస గృహాలకు లేదా భవనాలకు ఎటువంటి ముప్పు వాటిల్లలేదు. అయితే గాలిలో ఎగిసిపడుతున్న బూడిద పొగ చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతాలకు ఇబ్బందికరంగా మారింది. అగ్నిపర్వత అవశేషాలు కురుస్తున్న నేపథ్యంలో స్థానిక హవాయి కౌంటీ అధికారులు జిమ్నాసియంలలో ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేశారు. రోడ్డు మూసివేత వల్ల చిక్కుకుపోయిన పర్యాటకులు, నివాసితులు ఇక్కడ ఆశ్రయం పొందవచ్చని కౌంటీ ప్రతినిధి టామ్ కాలిస్ తెలిపారు.

ఈ దృశ్యాలు భయానకంగా ఉన్నప్పటికీ కిలౌయా అందాలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. అయితే అగ్నిపర్వత ప్రాంతం నుంచి వెలువడే విషపూరిత వాయువులు బూడిద వల్ల శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అగ్నిపర్వత విస్ఫోటనం ఎన్ని గంటలు లేదా ఎన్ని రోజులు కొనసాగుతుందనేది ఇప్పుడే అంచనా వేయలేమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ స్థానిక యంత్రాంగం రక్షణ చర్యలు చేపడుతోంది.

Advertisement

Read Also: ROCK SALT: రాళ్ళ ఉప్పుతో ఇలా చేస్తే మీ సంపద  రెట్టింపు అవుతుందట

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×