Khushboo: ఒకప్పటి పాపులర్ హీరోయిన్.. ఖుష్బూ సుందర్ ఇటీవల తన వెయిట్ లాస్ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు. ఆమె ఆరోగ్యం కోసం చేసిన ఈ మార్పు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో మందికి ప్రేరణగా మారింది. ఒకప్పుడు తన బరువు కారణంగా.. ఎదుర్కొన్న సమస్యలను కూడా ఆమె బహిరంగంగా వెల్లడించింది.
ఖుష్బూ ఒకప్పుడు తను బరువు వల్ల ఎదుర్కొన్న సమస్యల గురించి తెలిపింది. ఆ సమయంలో తన ఆరోగ్యం చాలా బలహీనంగా మారిందని తెలిపింది. ఆమె ఇలా చెప్పింది: “ఒకసారి నా ముఖాన్ని చూసుకుని నేనే భయపడ్డాను. కొంచెం నడిచినా ఊపిరి ఆడేది కాదు, మోకాలికి నొప్పి వచ్చేది. మళ్లీ ఈ స్థాయికి రావడానికి నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది.”
ఈ మాటలు చూస్తే ఆమె పరిస్థితి ఎంత కష్టంగా ఉండేదో అర్థమవుతుంది. ఆ సంఘటన తర్వాత ఆమె తన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకుంది. అదే ఆమె వెయిట్ లాస్ ప్రయాణానికి ఆరంభంగా మారింది.
ఖుష్బూ మరో ముఖ్యమైన విషయం కూడా వెల్లడించింది. భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను ముందుగానే నివారించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. “మధుమేహం మరియు హై బీపీ అనేవి టైమ్ బాంబుల్లాంటివి. అవి నాకు రాకుండా ఉండాలంటే నేను అదనంగా కృషి చేయాలని నిర్ణయించుకున్నాను” అని చెప్పుకొచ్చింది.
ఈ ఆలోచన ఆమెను క్రమశిక్షణతో జీవించడానికి ప్రేరేపించింది. సరైన ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, మంచి నిద్ర తీసుకోవడం వంటి అలవాట్లను ఆమె జీవితంలో భాగంగా చేసుకుంది.
ఖుష్బూ క్రమంగా తన బరువును తగ్గించుకోవడంలో విజయవంతమైంది. ఆమె దాదాపు 20 కిలోల వరకు.. బరువు తగ్గింది. ఈ మార్పు చూసి అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. యోగా కూడా ఆమె రోజువారీ జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. ఈ మార్పుల వల్ల ఆమె ఫిట్‌నెస్ మాత్రమే కాదు.. మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడింది అని తెలిపింది ఈ నటి.
ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ మార్పు ఖుష్బూ దగ్గరే ఆగిపోలేదు. కొన్ని రోజుల క్రితం ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన కుటుంబ ఫోటోలో ఆమె కుమార్తెలు కూడా చాలా సన్నగా, ఫిట్‌గా కనిపించారు.
55 సంవత్సరాల వయస్సులో కూడా ఖుష్బూ ఇలా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం ఎంతో మందికి ప్రేరణగా మారింది. వయస్సు ఎంతైనా సరే క్రమశిక్షణ, సహనం ఉంటే ఆరోగ్యాన్ని మార్చుకోవచ్చు అని ఆమె కథ చెబుతోంది.
ALSO READ: Allu Cinemas: అల్లు సినిమాస్.. టాలీవుడ్ డైరెక్టర్లకు ప్రత్యేక గౌరవం..ఫిదా అవుతున్న ఫ్యాన్స్!