BigTV English
Advertisement

Kim Sister: కిమ్ చెల్లి.. అతడి కంటే కంత్రీలా ఉందే, దక్షిణ కొరియాకు దడ పుట్టించేలా కామెంట్స్!

Kim Sister: కిమ్ చెల్లి.. అతడి కంటే కంత్రీలా ఉందే, దక్షిణ కొరియాకు దడ పుట్టించేలా కామెంట్స్!

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. దక్షిణ కొరియా అమెరికాతో చేతులు కలిపి రక్షణ రంగంలో జాయింట్ ఆపరేషన్లు చేపట్టడంతో ఈ పరిస్థితులు మరింత దిగజారాయి. అయితే సౌత్ కొరియాలో కొత్త అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ రాకతో పొరుగు దేశం ఉత్తర కొరియాతో సంబంధాలు మెరుగవుతాయని అనుకున్నారంతా. కానీ ఆయన కూడా అమెరికా రాగం పాడుతున్నారు. దీంతో దక్షిణ కొరియా నుంచి తీవ్రమైన స్వరంతో హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ కొరియా తమకు ఇంకా శత్రువుగానే ఉందని అన్నారు ఉత్తర కొరియా మిలట్రీ చీఫ్ కిమ్ జోంగ్ ఉన్న సోదరి కిమ్ యో జోంగ్.


కిమ్ కంటే డేంజర్..
కిమ్ జోంగ్ ఉన్ గురంచి తెలిసినవారెవరైనా అత్యంత ప్రమాదకరమైన నియంత అని అంటారు. ఆయనకంటే ప్రమాదకరమైన వ్యక్తి సోదరి కిమ్ యోజోంగ్. ఇటీవల కాలంలో ఆమె తన అన్నవెన్నంటే ఉంటోంది. చెల్లెలు అంటే అన్నకు కూడా ప్రాణం, ప్రేమ. అందుకే పాలనలో కొన్ని కీలక విభాగాలను ఆమెకు అప్పగించాడు. కిమ్ ని కలిసేందుకు వచ్చే ప్రముఖులను యోజోంగ్ కూడా కలుస్తుంటారు. ఉత్తర కొరియాలో కొందరు ఆమెను సహ నియంత అని పిలుస్తుంటారు. ఆమధ్య కిమ్ సోదరి యోజోంగ్ పై ఓ పుస్తకం కూడా రాశారు. ది సిస్టర్ పేరుతో విడుదలైన ఆ పుస్తకంలో ఆమెను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించారు. ఇక అసలు విషయానికి వస్తే, దక్షిణ కొరియాలో ప్రభుత్వం మారినా కూడా వారితో సత్సంబంధాలు పలపడే అవకాశాలు లేవని యోజోంగ్ తేల్చి చెప్పారు.

చర్చలకు నో..
తమ వద్దకు ఏ ప్రతిపాదనతో వచ్చినా కూడా దక్షిణ కొరియాతో చర్చలలో ఆసక్తి లేదని తేల్చి చెప్పారు కిమ్ సోదరి యోజోంగ్. జూన్ 4న కొత్త దక్షిణ కొరియా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉత్తర కొరియా నుంచి నేరుగా ఎలాంటి స్పందన రాలేదు. అధినేత కిమ్ కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా కిమ్ సోదరి యోజోంగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ రాజీ ప్రయత్నాలను.. అమెరికాతో దక్షిణ కొరియా పెట్టుకున్న సైనిక పొత్తు తుడిచి వేసిందన్నారు యోజోంగ్. దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు అమెరికాతో తిరిగి కూటమి కడుతున్నందున.. తమ మధ్య సంబంధాలు మెరుగుపడటానికి అవకాశం లేదని ఆమె తేల్చి చెప్పారు. శత్రువును అర్థం చేసుకోవడంలో ఉత్తర కొరియా యొక్క అవగాహనలో ఎటువంటి మార్పు ఉండదని ఆమె చెప్పారు. చరిత్ర గడియారం ముళ్లను దక్షిణ కొరియా వెనక్కి తిప్పలేదని తేల్చేశారు.


దక్షిణ కొరియా – అమెరికా మధ్య తాజాగా సైనిక సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఉమ్మడి సైనిక విన్యాసాలను రెండు దేశాలు ముమ్మరం చేశాయి. అమెరికా నేవీ బాలిస్టిక్ క్షిపణులు, జలాంతర్గాములు, విమాన వాహక నౌకలు.. దక్షిణ కొరియా ఓడరేవుల వద్ద ఉమ్మడి విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఉత్తర కొరియాకు శత్రువులుగా ఉన్న జపాన్‌, అమెరికాతో దక్షిణ కొరియా సైనిక సంబంధాలను పెంచుకోవడం కూడా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉన్న తాజా పరిస్థితుల్ని మరింత దిగజార్చాయి.

Related News

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయ సంతతి వ్యక్తిదే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Donald Trump: పాక్ అణ్వాయుధాలను టెస్ట్ చేస్తుందా? మళ్లీ యుద్ధం స్టార్ట్..!

America: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. పాక్-చైనా అణ్వాయుధ పరీక్షలు, వచ్చే ఏడాది కోసం గ్రౌండ్ ప్రిపేర్

Nepal Avalanche: నేపాల్ ఎవరెస్టు బేస్ క్యాంప్‌.. విరుచుకుపడిన హిమపాతం, ఏడుగురు మృతి

Big Stories

×