E-Paper
Advertisement

Modi Trump Phone Call: ట్రంప్‌కు మోడీ ఫోన్ కాల్.. భారత్-పాక్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Modi Trump Phone Call: ట్రంప్‌కు మోడీ ఫోన్ కాల్.. భారత్-పాక్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

Modi Trump Phone Call: ఓ కథను మళ్లీ మళ్లీ చెబుతుంటే.. దానిలో మనం కొత్త విషయాలను కలుపుతూ పోతుంటాం. ఎందుకంటే మన క్రియేటివిటీని అందులో కలపాలనే ఓ ఉబలాటం అంతే. ఇలాంటి కథలు రాయడంలో అయినా.. చూపించడంలో అంటే సినిమా రూపంలో అయితే చాలా బాగుంటుంది. కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా అదే రీపిట్ అయితే.. అది కూడా అగ్రదేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి మాట్లాడితే.. సేమ్ ఇలానే ఉంటుంది వినండి.

భారత్ – పాక్ యుద్ధాన్ని ఆపే విషయంలో ట్రంప్ కొత్త కథ…
ట్రంప్‌ తన స్క్రిప్ట్‌ను రోజురోజుకు అప్‌డేట్‌ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు భారత్, పాక్ యుద్ధాన్ని ఆపానంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత న్యూక్లియర్ వార్‌ను ఆపానన్నారు.. ఆ తర్వాత కూలిన ఫైటర్‌ జెట్‌ల నెంబర్‌ను మార్చారు..

Advertisement

మోడీ తనకు కాల్ చేశారన్న ట్రంప్
ఇప్పుడేమో ఏకంగా 350 శాతం టారిఫ్‌లు వేస్తానని వార్నింగ్ ఇచ్చాను.. దెబ్బకు యుద్ధాన్ని ఆపేశారు.. అంటున్నారు. అక్కడితో ఆగారా.. ఏకంగా ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్రమోడీ ఫోన్‌ చేసి తనకు స్వయంగా చెప్పారన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలపై భారత్‌లోనే కాదు.. ప్రపంచ దేశాల్లో కూడా నవ్వుకుంటున్నారు.

60 సార్లు యుద్ధాన్ని ఆపానని చెప్పుకున్న ట్రంప్
ట్రంప్‌ ఇప్పటి వరకు తానే యుద్దాన్ని ఆపానని చెప్పుకోవడం ఇది 60వ సారి అని చెప్పాలి. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ హాజరైన అమెరికా-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్.

Advertisement

ట్రంప్ వ్యా్ఖ్యలను కొట్టిపారేస్తున్న మోడీ..
బట్ భారత్‌ మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికే అనేకసార్లు ఖండించింది. పాకిస్థాన్‌ కాళ్ల బేరానికి వస్తేనే యుద్ధానికి బ్రేక్ ఇచ్చామంది. అయినా కానీ ఇవేవీ పట్టించుకోవడం లేదు ట్రంప్. తాను చెప్పాలనుకున్నది చెప్పుకుంటూ వెళ్తున్నారు. సరే ట్రంప్‌ టారిఫ్‌ల బెదిరింపులతోనే యుద్ధాన్ని ఆపారనుకుంటే.. మరి భారత్‌పై ఇంకా టారిఫ్‌లు ఎందుకు కొనసాగుతున్నాయి? చైనాపై టారిఫ్‌లు విధించడానికి ఏ యుద్ధం కారణమైంది? ఏమో మరి ఆయనకే తెలియాలి.

Also Read: సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం.. డేట్స్ కూడా ఫిక్స్..! ఎప్పుడంటే..?

నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఇదంతా చేస్తున్నాడని టాక్..!
మొత్తానికి నోబెల్ శాంతి బహుమతి కోసం ఆయన చేయాల్సినదంతా చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. శాంతి బహుమతి వస్తుందో లేదో తెలియదు కానీ.. తన పరువును తానే తీసుకోవడం అనే ఏదైనా కేటగిరి ఉంటే అందులో మాత్రం ట్రంప్‌కు బహుమతి రావడం మాత్రం పక్కా.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×