E-Paper
Advertisement

Droupadi Murmu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి.. మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకోనున్న ద్రౌపది ముర్ము..

Droupadi Murmu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి.. మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకోనున్న ద్రౌపది ముర్ము..
Advertisement

Droupadi Murmu: నేడు తిరుమల వెంకన్న సేవలో రాష్ట్రపతి.. ముందుగా ఉదయం 9:30 గంటలకు రాష్ట్రపతి వరాహస్వామి దర్శనం చేసుకుని, అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద రాష్ట్ర మంత్రులు, టిటిడి ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అర్చక స్వాములు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో రాష్ట్రపతిని ఆలయంలోకి ఆహ్వానించారు. శ్రీవారి దర్శనం తర్వాత మధ్మాహ్నం 12:15 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించడానికి నేడు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఈ మహోత్సవం రాష్ట్రపతి నిలయంలో జరుగుతుంది.

Advertisement

నేడు రాష్ట్రపతి షెడ్యూల్
నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అయితే మధ్యాహ్నం 12:30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుంది. అక్కడ ఆమెకు గవర్నర్, సిఎం రేవంత్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు ఘనంగా స్వాగతం పలుకుతారు.

మధ్యాహ్నం 1:30 గంటలకు నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకోని అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 3:25 గంటల వరకు రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు.

Advertisement

సాయంత్రం 3:50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటుంది. అలాగే సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భారతీయ కళా మహోత్సవంలో పాల్గొంటారు. ఈ మహోత్సవం రెండవ సంచిక, నవంబర్ 22 నుంచి 30 వరకు ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, కళాకారులతో సంభాషించి, భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తారు.

Also Read: ఇండియన్ ఆర్మీలోకి అమెరికా మిసైల్లు, రష్మా ఫైటర్ జెట్లు.. ఇక పాక్, చైనా వణకాల్సిందే..

ఆ తర్వాత సాయంత్రం 6:15 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకోని రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. నవంబర్ 22, ఉదయం 9:30 గంటలకు బేగుంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి పుట్టపర్తికి బయలుదేరుతారు.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×