E-Paper
Advertisement

Mojtaba Khamenei: ట్రంప్‌కు చెమటలు పట్టిస్తున్న.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్.. ముజ్తబా ఖమేనీ గురించి తెలుసా?

Mojtaba Khamenei: ట్రంప్‌కు చెమటలు పట్టిస్తున్న.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్.. ముజ్తబా ఖమేనీ గురించి తెలుసా?
Advertisement

Mojtaba Khamenei: ఇజ్రాయెల్, అమెరికా జరుపుతున్న దాడులను ఇరాన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ.. డ్రోన్, క్షిపణులతో అపార నష్టాన్ని కలిగిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ఇక వెనక్కి తగ్గుతుందని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. కానీ ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ గా ముజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) బాధ్యతలు చేపట్టడం అమెరికా, ఇజ్రాయెల్ లో ఆందోళనలను పెంచుతోంది.

సుప్రీం లీడర్‌గా ప్రకటన

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ.. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో మరణించారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి సమావేశమైన ఇరాన్‌లోని ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ (Assembly of Experts) బృందం.. ఆయన కుమారుడైన ముజ్తబా ఖమేనీని నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నట్లు అర్ధరాత్రి తర్వాత ప్రకటించింది. సుప్రీం లీడర్ స్థానం కోసం ఇద్దరు, ముగ్గురు పేర్లు వినిపించినా.. చివరికి ముజ్తబా ఖమేనీ తమ నాయకుడిగా ఎంచుకోవడం గమనార్హం.

మొజ్తబా ఖమేనీ ఎవరు?

Advertisement

ఈయన అలీ ఖమేనీ యొక్క రెండవ కుమారుడు. 1969లో జన్మించారు. గత రెండు దశాబ్దాల కాలంగా ఇరాన్ రాజకీయాలపై పరోక్షంగా ప్రభావం చూపిస్తూ వస్తున్నారు. తెరవెనుక చక్రం తిప్పుతున్న శక్తివంతమైన వ్యక్తిగా ముజ్తబా ఖమేనీకి పేరుంది. ముఖ్యంగా ఇరాన్ సైనిక విభాగం IRGC (Islamic Revolutionary Guard Corps)తో ఈయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

తండ్రి కంటే కఠినంగా..

తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ కంటే మరింత కఠినమైన వ్యక్తిగా ముజ్తబాను ఇరాన్ పౌరులు పరగణిస్తుంటారు. 2009లో వివాదాస్పద అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనేజాద్ తిరిగి ఎన్నికైన తర్వాత చెలరేగిన నిరసనలను అణిచివేయడంలో ఆయన పాత్ర ఉందని చెబుతుంటారు. ముజ్తబా.. చమురు ఆదాయాలు, విదేశీ పెట్టుబడులతో ముడిపడి ఉన్న ఆర్థిక నెట్ వర్క్ ను నడిపిస్తూ.. రూ.వేల కోట్ల సంపదను కూడబెట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఖమేనీని అంతం చేసిన ఆనందంలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ కు ఇప్పుడు అతడికంటే క్రూరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి సుప్రీం స్థానంలోకి రావడం ఆయా దేశాలను ఆందోళనపై పడేసింది.

Advertisement

Also Read: E Office: తెలంగాణ సర్కార్ మరో సంచలనం.. ఇకపై అన్ని ప్రభుత్వ సేవలు ఈ-ఆఫీస్ లోనే..?

అమెరికా, ఇజ్రాయెల్‌ల వార్నింగ్..

ఇరాన్ తర్వాతి నాయకుడెవరైనా సరే తమ లక్ష్యంగానే ఉంటారని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించింది. ముజ్తబా నియామకంపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గిడియాన్ సార్ స్పందిస్తూ ఆయన కూడా తమ హిట్ లిస్ట్‌లో ఉండవచ్చని సంకేతాలిచ్చారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొజ్తబా నియామకాన్ని తప్పుపట్టారు. ఇరాన్‌లో శాంతిని కోరుకునే వ్యక్తి నాయకుడిగా ఉండాలని.. ముజ్తబా వంటి వారు తమకు అంగీకారం కాదని ఆయన పేర్కొన్నారు.

Also Read: Motorola Discount: మోటొరోలా కొత్త లగ్జరీ ఫోన్‌పై రూ.10000 ధర తగ్గింపు.. త్వరపడండి లిమెటెడ్ ఆఫర్

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×