BigTV English

Name Shorten: ఆ యువరాణి పేరు.. ఎంతో పొడవు..!

Name Shorten: ఆ యువరాణి పేరు.. ఎంతో పొడవు..!

Name Shorten: ఆ పేరు పలకాలంటే కష్టం. చాంతాడంత పొడవున్న ఆ పేరులో ఎన్ని పదాలు, ఎన్ని అక్షరాలు ఉంటాయో ఓ సారి ఊహించండి. మీ వల్ల కాకపోవచ్చు. 25 పదాలు.. 157 అక్షరాలున్న ఆ స్పానిష్ పేరును ఉచ్ఛరిస్తే పట్టపగలే నక్ష్రతాలు కనిపించడం ఖాయం.


అంత పొడవైన పేరు ఏమిటా అని తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్నారా? అయితే చూడండి.. Sofia Fernanda Dolores Cayetana Teresa Angela de la Cruz Micaela del Santisimo Sacramento del Perpetuo Socorro de la Santisima Trinidad y de Todos Los Santos. అయ్యబాబోయ్ ఇదేం పేరు అనుకుంటున్నారా?

ఆ పాప తల్లిదండ్రులైన స్పానిష్ డ్యూక్, డచెస్‌కు ఆ పేరు నమోదు చేయాలంటే పెద్ద సమస్యగా మారింది. డ్యూక్ ఫెర్నాండో జాన్ ఫిట్జ్-జేమ్స్ స్టార్ట్ యె డె సాలిస్(33), ఆయన సతీమణి సోఫియా ప్లాజివెలో(31) తమ ముద్దుల చిన్నారికి ఆ పేరు పెట్టారు. అయితే పేరు నమోదు సమయంలోనే సమస్యలొచ్చి పడ్డాయి.


అంత పొడవైన పేరును రిజిస్టర్ చేసేందుకు నిబంధనలు అనుమతించవు. తాతలు, అవ్వల గౌరవసూచకంగా వారి పేర్లు కలిసి వచ్చేలా పిల్లలకు పేర్లు పెట్టడం మనకు అలవాటే. అలాగే అల్బా డచెస్, రాజవంశంలోని ఇతర సభ్యుల పేర్లు అన్నింటినీ కలిపి పెట్టడం వల్ల డ్యూక్ ఫెర్నాండో చిన్నారి పేరు చాంతాడంత అయింది. ఇటీవల మరణించిన అల్బా డచెస్ కయటానా(Cayetana) పేరును కూడా అందులో చేర్చారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×