E-Paper
Advertisement

షాపింగ్ మాల్ కోసం.. 200 ఏళ్ల నాటి గురుద్వారా కూల్చివేత.. పాక్‌ను ఏకిపారేస్తున్న సిక్కులు!

షాపింగ్ మాల్ కోసం.. 200 ఏళ్ల నాటి గురుద్వారా కూల్చివేత.. పాక్‌ను ఏకిపారేస్తున్న సిక్కులు!
Advertisement

Quetta Gurdwara: పాకిస్థాన్‌లోని క్వెట్టాలో ఉన్న 200 ఏళ్ల నాటి ప్రాచీనమైన శ్రీ గురు సింగ్ సభా గురుద్వారాను స్థానిక యంత్రాంగం కూల్చివేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై అక్కడి సిక్కు సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు గురుద్వారా కాంప్లెక్స్ లో ఓ పాఠశాల కూడా ఉండటం స్థానికుల్లోనూ ఆగ్రహానికి దారితీసింది.

షాపింగ్ మాల్ కోసం కూల్చివేత

ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే యంత్రాంగం ఈ చారిత్రాత్మక స్థలాన్ని ధ్వంసం చేసిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒక ప్రైవేట్ డెవలపర్‌కు ప్రయోజనం చేకూర్చేలా.. అక్కడ వాణిజ్యపరమైన షాపింగ్ ప్లాజా నిర్మాణానికి ఈ స్థలాన్ని అప్పగించినట్లు చెబుతున్నారు. మరోవైపు ఈ చర్యను భారత ప్రభుత్వం పాకిస్థాన్‌తో చర్చించి నిలదీయాలని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌.పి. సింగ్.. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు.

రంగంలోకి గ్లోబల్ సిక్కు కమ్యూనిటీ

Advertisement

ఈ పవిత్ర స్థలాన్ని వెంటనే పునర్నిర్మించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యే వరకు మరోచోట శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీని నిలిపి ఉంచి ప్రార్థనలు చేసుకునేందుకు తాత్కాలిక స్థలాన్ని కేటాయించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

క్షీణిస్తున్న సిక్కు క్షేత్రాల సంఖ్య

అయితే బలూచిస్థాన్‌లో మైనారిటీ వర్గాల మతపరమైన స్థలాలు లక్ష్యంగా మారడం ఇదే మొదటిసారి కాదు. ఒకప్పుడు ఈ ప్రావిన్స్ లో 12 గురుద్వారాలు ఉండగా.. వాటిలో కాలక్రమేణా 10 ధ్వంసమయ్యాయని స్థానిక సిక్కు సమాజం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం కేవలం రెండు గురుద్వారాలు మాత్రమే మిగలడంతో తమ వారసత్వం, భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Also Read: గుంటూరు ల్యాండ్ వివాదం.. చంద్రబాబుకు జోగి రమేష్ ఓపెన్ ఛాలెంజ్.. దమ్ముంటే ఎంక్వైరీ వేసుకోండి!

భారత్ నుంచి ఆగ్రహ జ్వాలలు

గురుద్వారా కూల్చివేతపై భారత్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌కు మాజీ ఎంపీ తర్లోచన్ సింగ్ మెమోరాండం సమర్పించి, షాపింగ్ ప్లాజా నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి గురుద్వారాను పునర్నిర్మించాలని కోరారు. మరోవైపు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) అధ్యక్షుడు హర్జించేర్ సింగ్ ధామీ ఈ చర్యను సిక్కు వారసత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, స్థలాన్ని తిరిగి సిక్కు సమాజానికి అప్పగించాలని ఆయన పాక్ అధికారులను డిమాండ్ చేశారు.

Also Read: అప్పటి ప్రజలతో.. రాముడు, కృష్ణుడు ఏ భాషలో మాట్లాడేవారు? బయటపడ్డ అసలు నిజం!

Tags

Related News

యురేనియం డీల్, ఫ్రీ వీసా, పౌర పురస్కారం.. ప్రధాని ఉజ్బెకిస్థాన్ పర్యటన సూపర్‌ హిట్!

నేపాల్‌లో అద్భుతం.. 1,643 మంది విద్యార్థులను కాపాడిన హెడ్ మాస్టర్.. ఏం జరిగిందంటే?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక నిర్ణయం.. డోక్లాం-గాల్వాన్ ఘర్షణల జనరల్‌పై వేటు, ఏం జరిగింది?

ట్రంప్ సర్కార్ కొత్త కసరత్తు.. 90 శాతం భారతీయులపై ప్రభావం, హెచ్-4 ఈఏడీ వర్క్‌పై..

ప్రభుత్వాన్నే బ్లాక్‌మెయిల్ చేస్తున్న సైబర్ దొంగలు.. రూ.23 కోట్ల విలువగల బిట్‌కాయిన్స్ ఇవ్వాలని బెదిరింపులు

ఏంటీ.. నేపాల్ వరద ప్రవాహ వేగం గంటకు 200 కిమీలా? 4 వేల మీటర్ల ఎత్తు నుంచి దూకి..

ఒకవైపు నేపాల్లో వందలాది చావులు.. మరోవైపు చోరీ ఘటనలు.. అసలు మనుషులేనా వీళ్లు?

Big Stories

Advertisement
×