BigTV English

KGB Agent Trump: రష్యాకు ట్రంప్ రహస్య గూఢచారి – కేజీబీ మాజీ ఛీప్ ఇంకా ఏం చెప్పారంటే.?

KGB Agent Trump: రష్యాకు ట్రంప్ రహస్య గూఢచారి – కేజీబీ మాజీ ఛీప్ ఇంకా ఏం చెప్పారంటే.?

KGB Agent Trump:  ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో.. ట్రంప్ తమ చిరకాల శత్రువైన రష్యా వైపు మద్ధతుగా నిలవడంతో.. ట్రంప్ – రష్యా సంబంధాలపై అనేక ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన్ను ఏకంగా రష్యా ఏజెంట్ అంటూ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ వాదనల్ని బలపరుస్తూ.. కొంతమంది ప్రభావంతమైన వ్యక్తులు సైతం కామెంట్లు చేస్తుండడంతో..తీవ్ర చర్చల్లో నిలుస్తోంది. ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో జెలెన్స్కీతో తీవ్రంగా విభేధిస్తున్న ట్రంప్.. పుతిన్ పై సానుకూల వైఖరితో ఉన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ తో నేరుగా మాట్లాడాతానంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఒకప్పడు రష్యా గూఢాచారిగా పని చేశారు అంటూ వివిధ కథనాలు ప్రసారం అవుతున్నాయి.


అమెరికా – రష్యా.. నిత్య ప్రత్యర్థులు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ఎంత దూరమైన వెళతారు. ఆయుధ సంపత్తిని పోగేసుకోవడం నుంచి సాంకేతికతల్ని అభివృద్ధి చేసుకోవడం వరకు అనేక అంశాల్లో నిత్యం పోటీ ఉంటుంది. అంతర్జాతీయ రాజకీయాల్లోనూ ఇద్దరివీ రెండు ధృవాలు. ఏవైనా రెండు దేశాలకు యుద్ధం వస్తే.. చెరో వైపు చేరి ప్రచ్ఛన్న యుద్ధాన్ని సాగిస్తుంటాయి. అలాంటి దేశాలు కాస్తా.. ట్రంప్ హయాంలో కాస్త స్నేహంగా కనిపిస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల రష్యా ఉక్రెయిన్ ను ఆక్రమించేందుకు ప్రయత్నించింది అంటూ ఉక్రెయిన్ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని అమెరికా తిరస్కరించింది కూడా. ఇలా.. పుతిన్ పై ట్రంప్ సానుకూల ధోరణి అనేక మందిని ఆశ్చర్యపరుస్తోంది.

శాంతి ఒప్పందం కుదుర్చుకోమని, యుద్ధం నుంచి వెనుదిరగమని ఉక్రెయిన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. పుతిన్ సర్కార్ తో నేరుగా చర్చలకు సైతం ట్రంప్ సిద్ధమయ్యారు. అప్పటికే పలు మార్లు ఇరు దేశాల అధికారులు సమావేశాలు నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. రష్యా గూఢచార సంస్థ కేజీబీలో ట్రంప్ పనిచేశారంటూ.. కేజేబీ మాజీ సోవియట్‌ అధికారి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వైరల్ అయ్యింది. దాంతో.. ఈ కథనాలతో మిర్రర్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇందులో.. ట్రంప్ పై వస్తున్న ఆరోపణలు, అందుకు వాళ్లు చూపిస్తున్న కారణాల్ని వివరించింది.


1980ల్లో కేజీబీ నియమించుకుంది.

అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అమెరికాలో చాలా మంది గుఢాచారుల్ని నియమించుకున్న కేజీబీ.. కాస్త దూకుడుగా, దూసుకుపోయో తత్వం ఉన్న ట్రంప్ ను తన ఏజెంట్ గా నియమించుకుంది. ఆయనకు అనేక విషయాల్లో రష్యా సాయం చేసింది అంటూ సోవియట్‌ ఇంటెలిజెన్స్ అధిపతిగా పని చేసిన అల్నూర్‌ ముస్సాయేవ్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ నియామకం 1987లో జరిగిందని.. అప్పటి నుంచి ట్రంప్ రష్యాకు సమాచారం అందిస్తూనే ఉన్నారని తెలిపారు. ఈయన చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపించలేదు. కానీ.. సోవియట్ రష్యాకు ఇంటిలిజెన్స్ అధిపతిగా చేసిన వ్యక్తి కావడంతో.. అంతాట తీవ్ర చర్చకు దారి తీసింది.

ఆరోపణలు చేసిన వ్యక్తి.. సోవియట్ రష్యా విచ్ఛిన్నం అయిన తర్వాత కజకిస్థాన్ లో చాన్నాళ్లు పని చేశారు. ప్రస్తుతం రష్యాలో లేకపోవడంతో.. ఆయన ఈ రహస్యాన్ని బయటపెడుతున్నట్లు వెల్లడించారు. అలాగే.. ట్రంప్ కు కేజీబీ పెట్టుకున్న సీక్రట్ పేరు ‘క్రస్నోవ్‌’ అంటూ తెలిపారు. ట్రంప్ అనేక సార్లు రష్యాలో పర్యటించారని, అక్కడి నుంచి పెట్టుబడుల కోసం వస్తున్నా అని చెప్పి, కేజీబీ దగ్గర శిక్షణ తీసుకున్నారంటూ వెల్లడించారు. ఇదే విషయాన్ని అమెరికాలోని కొంత మంది సైతం చెబుతున్నారు. ట్రంప్ వ్యాపారాల్లో రష్యాతో సంబంధాలున్న వ్యక్తులు భారీగా పెట్టుబడులు పెట్టారని, ఆయన సంస్థల్ని విస్తరించేందుకు పని చేశారని అంటున్నారు. అందుకే.. ట్రంప్ రష్యా విషయంలో మెతకగా ఉంటున్నారంటూ ఆరోపిస్తున్నారు. ట్రంప్ అనేక సార్లు రష్యాలో పర్యటించినప్పుడు హోటళ్లల్లో అమ్మాయిలతో గడిపారని.. ఆ సమాచారాన్ని గుప్పిట పెట్టుకుని పుతిన్.. ట్రంప్ ను ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది.

గత ఎన్నికల్లో ఓటమే అసలు కారణం..
2020 ఎన్నికల్లో ట్రంప్ పరాజయం పాలయ్యారు. ఆ సమయంలో ట్రంప్ నకు జెలెన్సీ సాయం చేయలేదని అందుకే కక్షకట్టి వేధిస్తున్నారంటూ మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో తన ప్రత్యర్థి అయిన బైడెన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు.. ఉక్రెయిన్ లోని బైడెన్‌ కుమారుడు హంటర్‌కు సంబంధించిన వ్యాపారాలపై దర్యాప్తు చేయాలని ట్రంప్ కోరారు. కానీ.. అందుకు జెలెన్స్కీ అంగీకరించలేదు. ఈ వ్యవహారాన్ని ఆయన లాయర్‌ రూడీ గులియానీ నడిపించిన విషయం తెలిసిందే. అయితే.. అనూహ్యంగా.. కొన్నాళ్లకు ట్రంప్ ఫోన్ కాల్ రికార్డు బయటకు రావడంతో.. ట్రంప్ కుట్రలు చేస్తున్నారంటూ ప్రచారం సాగింది. తన ప్రత్యర్థుల్ని ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం చేశారు. ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకుని.. ట్రంప్ జెలెన్స్కీ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటున్నారు మరికొంత మంది.

Also Read :

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×