Lakshmi Reddy – Kiran Royal: తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్, లక్ష్మీరెడ్డి మధ్య రాజీ కుదిరింది. తమ మధ్య రాజీ కుదిరిందని సాక్షాత్తు లక్ష్మీ రెడ్డి ప్రకటించారు. అయితే ఇక్కడే ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తనను ఇద్దరు నేతలు కలిసి రాజకీయం చేయాలని భావించినట్లు ఆమె చెప్పారు.
ఇటీవల కిరణ్ రాయల్ పై లక్ష్మీ అనే మహిళ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కిరణ్ రాయల్ కూడా వాటిని ఖండించారు. అయితే లక్ష్మీని ఇటీవల జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టు బెయిల్ ఇచ్చిన అనంతరం విడుదల చేశారు. ఆ తర్వాత తిరుపతికి వచ్చిన లక్ష్మీ మీడియా సమావేశం నిర్వహించి సంచలనం సృష్టించారు. ఆమె చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించాయని చెప్పవచ్చు. అయితే కిరణ్ రాయల్ పై ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ కూడా స్పందించింది. కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కోరింది. ఈ ఎపిసోడ్ ఇప్పుడు తుది అంకానికి చేరిందని చెప్పవచ్చు.
తిరుపతిలో మంగళవారం లక్ష్మీ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కిరణ్ రాయల్ పై మరోమారు సంచలన ఆరోపణలు చేసే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ లక్ష్మీ రెడ్డి తన కామెంట్స్ తో అందరినీ షాక్ కు గురి చేశారని చెప్పవచ్చు. తమ మధ్య కేసుల రాజీ కుదిరిందని లక్ష్మీ రెడ్డి చెప్పుకొచ్చారు. తిరుపతి కోర్టులో ఒకరిపై మరొకరు పెట్టుకున్న కేసులను ఉపసంహరించుకున్నట్లు ఆమె తెలిపారు. పలు పార్టీలు తన సమస్యను ట్రోల్స్ చేశాయని, అలాగే రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించారన్నారు.
తాను విడుదల చేసింది ఒక్క సూసైడ్ రికార్డింగ్ మాత్రమేనని, తన సమస్యకు సంబంధించి ఏ పార్టీని సహాయం చేయాలని కోరలేదన్నారు. అయితే తిరుపతికి చెందిన ఇద్దరు నేతల హస్తం ఉందని, తన వద్ద ఉన్న ఫోటోలను వారు తీసుకున్నట్లు ఆమె ఆరోపించారు. పార్టీలలోకి లాగి రాజకీయం చేయాలని చూస్తున్నారని, తాను ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్ చాలా నీచంగా ట్రోల్స్ చేస్తున్నాయని, ఇప్పటికైనా వారు అటువంటి పనులు మానుకోవాలని ఆమె కోరారు.
Also Read: Nara Lokesh: జగన్ కాదు వన్ డే ఎమ్మెల్యే.. లోకేష్ సంచలన కామెంట్స్
ఇక నుండి తాను కిరణ్ రాయల్ అంశం గురించి మాట్లాడదలుచుకోవడం లేదని, ఇంతటితో ఈ వివాదం సద్దుమనిగిందని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తం మీద కిరణ్ రాయల్ వర్సెస్ లక్ష్మీ రెడ్డి వివాదానికి తెర పడిందని చెప్పవచ్చు. మరి ఈ వివాదం సద్దుమణిగిన నేపథ్యంలో మళ్లీ జనసేన కాల్ బ్యాక్ చేసి కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తుందని స్థానిక జనసైనికులు భావిస్తున్నారు. గత 20 రోజులకు పైగా సాగిన వివాదంకు చివరికి ఎండ్ కార్డు పడిందని స్వయంగా లక్ష్మీ రెడ్డి చెప్పడం విశేషం. మరి ఈ అంశానికి సంబంధించి కిరణ్ రాయల్ స్పందన తెలియాల్సి ఉంది.
కిరణ్ రాయల్, లక్ష్మీరెడ్డి వ్యవహారంలో ట్విస్ట్..!
కిరణ్ రాయల్, లక్ష్మీరెడ్డి మధ్య కేసుల రాజీ
తిరుపతి కోర్టులో ఒకరిపై మరొకరు పెట్టుకున్న కేసులను ఉపసంహరించుకున్న కిరణ్ రాయల్, లక్ష్మీరెడ్డి pic.twitter.com/suOpHqkCsk
— BIG TV Breaking News (@bigtvtelugu) March 4, 2025