BigTV English

IND VS AUS: దెబ్బకు దెబ్బ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కు చేరిన టీమిండియా

IND VS AUS: దెబ్బకు దెబ్బ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కు చేరిన టీమిండియా

IND VS AUS: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో ( Champions Trophy 2025 tournament )… అందరూ అనుకున్నదే జరిగింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ సెమీ ఫైనల్ లో… టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఉత్కంఠ భరితంగా చివరి వరకు సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు.  ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. 48.1 ఓవర్లలోనే టీమిండియా గెలిచింది. దీంతో నేరుగా ఫైనల్ కి వెళ్ళింది. బౌలింగ్ అలాగే.. బ్యాటింగ్ లో దుమ్ము లేపిన టీం ఇండియా ప్లేయర్లు.. ఫైనల్ కు చేరుకున్నారు.  టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 84 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. కాస్త ఆగి ఉంటే కచ్చితంగా సెంచరీ చేసుకునేవాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ 45 పరుగులు చేయగా… అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు.


Also Read:  Rizwan Babar Dropped: పాక్ లో ప్రకంపనలు.. జట్టు నుంచి రిజ్వాన్, బాబర్ ఔట్.. కొత్త కెప్టెన్ ప్రకటన ?

రోహిత్ శర్మ 29 బంతుల్లో 28 పరుగులు చేసి టచ్ లో ఉన్న సమయంలోనే అవుట్ అయ్యాడు. ఇవాల్టి మ్యాచ్లో గిల్ పెద్దగా పేలలేదు. అటు ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 27 పరుగులు చేసి తన వంతు కృషి చేశాడు. చివర్లో హార్దిక్ పాండ్యా మూడు సిక్సర్లతో ఆస్ట్రేలియా కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. మరో ఆరు పరుగులు చేయాల్సి ఉండగా సిక్స్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. కానీ రాహుల్ సిక్స్ కొట్టి గెలిపించాడు.  ఇది ఇలా ఉండగా… చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో… అద్భుతం చేసి గెలిచిన టీమిండియా… మార్చి 9వ తేదీన ఫైనల్ ఆడబోతుంది. రేపు అంటే మార్చి 5వ తేదీన… సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.


పాకిస్తాన్ లోని లాహోర్ వేదికగా రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన… జట్టు ఫైనల్ కు చేరుతుంది. ఇప్పటికే ఫైనల్ కు చేరిన టీమిండియాతో… లాహోర్ వేదికగా గెలిచిన జట్టు… దుబాయ్ కి రావాల్సి ఉంటుంది. మార్చి 9వ తేదీన… దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. సౌత్ ఆఫ్రికా ఫైనల్ లోకి వస్తే టీమిండియా అవలీలగా గెలుస్తుందని ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read:  Rohit Sharma – Virat: నీకు కళ్ళు దొబ్బాయా..? కుల్దీప్ ను బండబూతులు తిట్టిన కోహ్లీ, రోహిత్ !

ఇక మొదటి సెమీఫైనల్ లో… ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. ఈ తరుణంలోనే 49.3 ఓవర్లలో.. 264 పరుగులకు ఆల్ అవుట్ అయింది ఆస్ట్రేలియా. టీమిండియా ఫాస్ట్ బౌలర్ షమీ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. అటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా రెండు వికెట్లు తీయడం జరిగింది. ఈ తరుణంలో… 264 పరుగులకే కుప్పకూలింది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవెన్ స్మిత్, హెడ్, అలెక్స్ రాణించాడు.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×