Nostradamus Baba Vanga Prediction: ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్, బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వెంగా 2025 సంవత్సరం గురించి కీలక విషయాలు వెల్లడించారు. ప్రపంచ అంతానికి బీజం పడే అవకాశం ఉందని ఖరాఖండిగా చెప్పారు. దేశాల నడుమ యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, గ్రహాంతరవాసుల దాడులు జరుగుతాయని అంచనావేశారు. 2025 గురించి దాదాపు ఇద్దరూ ఒకే విషయాన్ని చెప్పడం మానవాళిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది.
1555లోనే ఐరోపా యుద్ధాల గురించి చెప్పిన నోస్ట్రాడమస్
నోస్ట్రాడమస్ 1555లోనే ఐరోపా యుద్ధాల గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఐరోపాలో జరిగే యుద్ధాల కారణంగా పరిస్థితి పురాతన కాలంలో ప్లేగు వ్యాధి కారణంగా ఎదుర్కొన్న దుస్థితిని మించి ఉంటుందన్నారు. ఆయన మాటలను బట్టి చూస్తూ ఐరోపాలో బయోవార్ జరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు యూరోప్ లో నెలకొన్న అశాంతిని బేస్ చేసుకుని చెప్పి ఉండవచ్చని భావిస్తున్నారు.
యూరప్ యుద్ధం గురించి ముందే హెచ్చరించిన బాబా వెంగా
అటు బాబా వెంగా కూడా 2025లో యూరప్ లో పెద్ద యుద్ధం జరుగుతుందని హెచ్చరించారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచం నాశనం అయ్యేందుకు బీజం పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ జనాభాకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆమె హెచ్చరించారు.
ప్రకృతి వైపరీత్యాలతో ప్రపంచం అల్లకల్లోలం
యుద్ధాలకు తోడుగా, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ సంక్షోభాలు ప్రపంచానికి పెను ముప్పు కలిగిస్తాయని నోస్ట్రాడమస్ వెల్లడించారు. భీకరమైన వరదలు ఆయా దేశాల్లో మహా నగరాలను నాశనం చేస్తాయన్నారు. అగ్నిపర్వాతాలు బద్దలు కావడం, బ్రెజిల్ లో తీవ్రమైన వరదలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థం అవుతున్నది. అంతేకాదు, 2025 లో జరిగే యూరప్ వార్ ప్రపంచానికి తీవ్ర నష్టాన్ని చేసే అవకాశం ఉందన్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కరువు, అడవులలో కార్చిచ్చు గురించి కూడా నోస్ట్రాడమస్ ముందుగానే అంచనా వేశారు.
గ్రహాంతర వాసులపైనా కీలక వ్యాఖ్యలు
ఇక గ్రహాంతర వాసుల ఉనికి గురించి బాబా వంగా కీలక విషయాలు వెల్లడించారు. 2025 నాటికి భూమ్మీద ఏలియన్స్ కనిపిస్తాయన్నారు. తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తాయన్నారు. ప్రముఖ గ్లోబల్ ఈవెంట్ లో గ్రహాంతర వాసులు దాడి చేసే అవకాశం ఉందన్నారు. నోస్ట్రాడమస్ ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నిజమైన నోస్ట్రాడమస్, బాబా వంగా అంచనాలు
నోస్ట్రాడమస్, బాబా వంగా అంచనాలు చాలా వరకు నిజం అయ్యాయి. హిట్లర్ నిరంకుశత్వం, JFK దారుణ హత్య, COVID-19 మహమ్మారిని నోస్ట్రాడమస్ ముందుగానే అంచనా వేశారు. అటు బాబా వంగా చెర్నోబిల్ విపత్తు, ప్రినెస్ డయానా మృతి, 9/11 ఉగ్రదాల గురించి ముందుగానే చెప్పింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ 2025 గురించి చెప్పిన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. యుద్ధాల నుంచి ప్రకృతి విపత్తులు, ఏలియన్ల రాక గురించి చెప్పడంతో ఏం జరుగుతుందోనని ఆలోచిస్తున్నారు.
Read Also: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఆ దేశంపై ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు