Samantha: సమంత .. ఈ పేరు ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉన్నట్టే. ఆమె ఏం చేసినా సెన్సేషనే. సినిమా చేసినా.. యాడ్ చేసినా.. పోస్ట్ పెట్టినా .. పక్కన ఎవరితో ఉన్నా.. అంతా కూడా ఒక సంచలనమే. అక్కినేని ఇంటి కోడలిగా వెళ్లి ఎంత పాపులర్ అయ్యిందో.. చై కు విడాకులు ఇచ్చి బయటకు వచ్చేసి కూడా అంతే పాపులర్ అయ్యింది. ఇక ఆ తరువాత మయోసైటిస్ బారిన పడింది. అప్పుడు కూడా ఆమెకు సపోర్ట్ చేసినవారి కంటే ఎక్కువ ట్రోల్ చేసినవారే ఎక్కువ, నటిస్తుందని, ఓవర్ చేస్తుందని, ఇవన్నీ సింపతీ కోసమని.. ఇలా రకరకాలుగా మాట్లాడారు.
వాటినేమి పట్టించుకోకుండా సామ్.. తన పట్టుదల, దైర్యంతో ముందుకు అడుగువేసింది. ఇక ఆ వ్యాధి నుంచి కోలుకున్నాకా.. ఈ చిన్నది ముంబైలోనే మకాం పెట్టేసింది. ఈ మధ్యనే సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ కూడా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. అందుకే అమ్మడు ముంబైలోనే కొత్త ప్రాజెక్ట్స్ వెతుక్కుంటుంది.
AR Rahman: మోహిని- రెహమాన్ ఎఫైర్.. బాధగా ఉందన్న కొడుకు
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. సామ్.. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ అయినా రాజ్ అండ్ డీకే లో ఒకరైన రాజ్ తో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వచ్చాయి. అందులో నిజమెంత అనేది ఎవరికి తెలియదు. అయితే తాజాగా సమంత.. పబ్లిక్ లో ఒకరి చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒక ప్రైవేట్ పార్టీలో సామ్.. ఒక వ్యక్తి చెయ్యి పట్టుకొని నడవడానికి ట్రై చేసింది. అతను మాత్రం సామ్ చెయ్యిని వదిలించుకొని ముందుకు నడిచాడు. అయినా సామ్ వదలకుండా మరోసారి అతడి చెయ్యిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఈసారి కూడా అతను ఆమె చేతిని విదిలించుకున్నాడు. నిజం చెప్పాలంటే ఇది సామ్ కు చాలా పెద్ద అవమానం.
Mahesh Babu: నిన్ను చూసి గర్వపడుతున్నా.. మేనల్లుడుకి మామ ఆశీస్సులు
అసలు ఆ వ్యక్తి ఎవరు.. ? ఎందుకు ఇలా చేశాడు.. ? అంటే. అతని పేరు వనరాజ్ జవేరి. సమంత క్లోజ్ ఫ్రెండ్ అయిన క్రేషా బజాజ్ భర్త. వీరిద్దరూ కలిసి ఒక ప్రైవేట్ పార్టీకి అటెండ్ అయ్యారు. అయితే పార్టీ లోపలి రాగానే వనరాజ్ చెయ్యి పట్టుకొని నడవడానికి సామ్ ఎందుకు అంత ఆసక్తి చూపింది..? ఫ్రెండ్ భర్త అని తెలిసి.. అతడితో అంత క్లోజ్ గా ఉండడానికి ఎందుకు ట్రై చేసింది.. ?.. సిగ్గులేదా.. ఫ్రెండ్ భర్తపై ఎగబడుతున్నావ్ అంటూ నెటిజన్స్ ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఇంకొంతమంది అతను చెయ్యి ఇవ్వకుండా చాలా మంచి పని చేశాడు. లేకపోతే సామ్ తో ఎఫైర్ అని రచ్చ చేసి.. తన భార్యతో కూడా విడాకులు ఇప్పించేవారు. ఇలాంటివి బయట ఎంకరేజ్ చేయకపోవడమే మంచింది. ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా ఇలా చేయడం వలన ట్రోలర్స్ కు స్టఫ్ ఇచ్చినవారు అవుతారు అని వనరాజ్ ను ప్రశంసిస్తున్నారు.
ఇక ఈ వీడియో ఇప్పటిది కాకపోయినా .. ఈ వీడియోను బాలీవుడ్ క్రిటిక్ KRK పోస్ట్ చేయడంతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత.. ఒక వ్యక్తి చెయ్యి పట్టుకోవాలని ప్రయత్నిస్తే అతడు తప్పుకున్నాడు. ఇది ఆమెకు చాలా పెద్ద అవమానం అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Samantha Parbhu Ek Aadmi Ke Gale Padte Huwe. And the man is asking her to not hold his hand. Big time insult of @Samanthaprabhu2!🤪😁 pic.twitter.com/3Yg26visBe
— KRK (@kamaalrkhan) November 22, 2024