World Wide 8 Check Points: అంతర్జాతీయ చమురు మార్కెట్లు కేవలం ఉత్పత్తిపై కాకుండా అనేక సముద్ర మార్గాలపై ఆధారపడతాయి. ప్రతి రోజూ భారీ స్థాయిలో ముడి చమురు రవాణా అవుతుంటాయి. అవి సజావుగా నడవడానికి ప్రపంచ ఇంధన మార్కెట్‌కు చాలా కీలకం. సముద్ర మార్గాల ద్వారా రోజుకు దాదాపు 80 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేస్తాయి. అవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో కీలక కేంద్రాలుగా మారాయి. ఒక్క మార్గానికి ఇబ్బందులు తప్పవు.
చమురు రవాణాలో అవే కీలకం.. ఒక్కరోజు ఆగినా
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో కీలకంగా మారింది హోర్మూజ్ జలసంధి. దాని ద్వారా ఆసియా దేశాలకు ముడి చమురు సరఫరా అవుతుంది. మార్చి నెలలో దాదాపు 20 రోజులపాటు చమురు రవాణా నిలిచిపోవడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లతోపాటు ఆసియా దేశాలు అతులాకుతలమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కీలకమైన ఎనిమిది చమురు రవాణా చేస్తే మార్గాలపై ఓ లుక్కేద్దాం.
ప్రపంచంలో చమురు రవాణా సముద్రాల ద్వారా స్వేచ్ఛగా ప్రయాణించదు. ఇరుకైన- అధిక ప్రమాదకర మార్గాల ద్వారా సాగుతుంది. అవి ఇంధన మార్కెట్లతోపాటు ధరలను ప్రభావితం చేస్తాయి. ఒక్కోసారి సరఫరాకు అంతరాయం కలిగించేలా చేస్తాయి కూడా. 2025 మొదటి అర్ధభాగంలో ప్రతిరోజూ సుమారు 104.4 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రవాణా జరిగింది. అందులో దాదాపు 80 శాతం సముద్ర మార్గం ద్వారానే జరిగింది.
ప్రపంచానికి ఆ ఎనిమిది మార్గాలు చాలా కీలకం
1. మలక్కా జలసంధి: ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే చమురు మార్గం ఇది. ప్రతీ రోజు సుమారు 23.2 మిలియన్ బ్యారెళ్ల చమురును దీని ద్వారా రవాణా అవుతుంది. చమురు వాణిజ్యానికి ఏకైక సముద్ర మార్గం. హిందూ-పసిఫిక్ మహా సముద్రాలను కలుపుతుంది. మధ్య ప్రాచ్య ఉత్పత్తిదారులు- ఆసియా వినియోగదారులకు అతి తక్కువ దూరం గల మార్గంగా పని చేస్తుంది. ఆ మార్గంలో ఏ చిన్న అంతరాయం కలిగినా దాని ప్రభావం అంతా ఇంతా కాదు.
2. హోర్మూజ్ జలసంధి: ఇరాన్ యుద్ధం ఇప్పుడు దీని చుట్టూనే తిరుగుతుంది. ప్రపంచంలో అత్యంత సున్నితమైన మార్గాల్లో ఇది కూడా ఒకటి. ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ దాదాపు 20.9 మిలియన్ బ్యారెళ్ల ఇంధనం ప్రయాణిస్తుంది. ఈ జలసంధి ప్రపంచ ఇంధన భద్రతకు కీలకం కూడా. ఇరాన్-ఒమన్‌ల మధ్య పర్షియన్ గల్ఫ్‌ను సముద్రాలతో కలుపుతుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలలో నిరంతరం కేంద్ర బిందువుగా మారుతూ ఉంటుంది. అక్కడ చిన్నపాటి అస్థిరత ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేయగల శక్తి సామర్థ్యం ఈ జలసంధికి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే.
ALSO READ: ఓడియమ్మ.. దానిమ్మ జ్యూస్ తాగుతూ మరీ.. మిస్సైళ్లు వదులుతున్న ఇరాన్.. వీడియో వైరల్
3. కేప్ ఆఫ్ గుడ్ హోప్: ఇది ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా దిగువున ఉంటుంది. దీని ద్వారా రోజుకు సుమారు 9.1 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతున్న మార్గం. దీన్ని ప్రత్యామ్నాయ మార్గంగా ఆసియా దేశాలు భావిస్తాయి. సూయజ్ కాలువ ప్రమాదకరంగా ఉన్నప్పుడు, రద్దీగా విపరీతంగా ఉన్నప్పుడు ఓడలు తరచుగా ఈ ప్రాంతం మీదుగా టర్న్ అవుతాయి. దూరం పెరిగినా సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందనే నమ్మకం ఉన్న సముద్ర మార్గాల్లో తొలిస్థానం ఇది.
4. సూయజ్ కాలువ: సుమెడ్ పైప్‌లైన్ కీలకమైన మార్గం. ఆ మార్గం ద్వారా రోజుకు సుమారు 4.9 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. ఈ కారిడార్ యూరప్-ఆసియాల మధ్య ప్రత్యక్ష అనుసంధానం కలిగివుంది. సూయజ్ కాలువ మధ్యధరా- ఎర్ర సముద్రం మధ్య ట్యాంకర్ల ప్రయాణానికి వీలు కల్పిస్తుంది. ఓడలు కాలువకు చాలా పెద్దవిగా ఉన్నప్పుడు సుమెడ్ పైప్‌లైన్ ఒక ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.
5. డానిష్ జలసంధి: ఉత్తర ఐరోపా ప్రవేశ ద్వారం డానిష్ జలసంధి. దీని మార్గం ద్వారా రోజుకు సుమారు 4.9 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా అవుతుంది. బాల్టిక్ సముద్రాన్ని ప్రపంచ మార్కెట్లతో అనుసంధానిస్తాయి. రష్యా నుంచి ఉత్తర ఐరోపా చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన మార్గం. అందువల్ల ప్రాంతీయ ఇంధన రవాణా మార్గాల్లో ఇవి వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి.
6. బాబ్ ఎల్-మండేబ్: చూడటానికి వీ ఆకారంలో ఉన్నా కీలకమైన ఈ జలసంధి. దీని ద్వారా రోజుకు సుమారు 4.2 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. ఎర్ర సముద్రాన్ని ఏడెన్ గల్ఫ్‌కు అనుసంధానిస్తుంది. దీనిద్వారా యూరప్-ఆసియా మధ్య వాణిజ్యానికి మరొక కీలకమైన మార్గం కూడా. కాకపోతే ఇక్కడ హౌథీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. హోర్మూజ్ జలసంధికి ఒకవైపు ఇరాన్ మాదిరిగానే.. బాబ్ ఎల్-మండేబ్ జలసంధికి హౌథీలకు కీలకం కూడా.
7.టర్కిష్ జలసంధి: నల్ల సముద్రపు జల రవాణా మార్గం. దీని ద్వారా రోజుకు సుమారు 3.7 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. నల్ల సముద్రం నుండి అంతర్జాతీయ మార్కెట్లు, చమురు ఎగుమతులకు ఈ మార్గం కీలకమైన వాటిలో ఒకటి.
8.పనామా కాలువ: ఉత్తర అమెరికా-దక్షిణ అమెరికా మధ్య ఉంటుంది పనామా కాలువ. చిన్నదైనప్పటికీ వ్యూహాత్మక మార్గం. దీని ద్వారా రోజుకు సుమారు 2.3 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. అట్లాంటిక్-పసిఫిక్ మధ్య ఖండాలకు వాణిజ్యానికి మద్దతు ఇస్తుంది. మిగతా 20 శాతం చమురు సముద్ర మార్గేతర మార్గాల ద్వారా చమురు రవాణా అవుతుంది. పైప్‌లైన్‌లు, రైలు, భూమార్గాల ద్వారా రోజుకు సుమారు 24.6 మిలియన్ బ్యారెళ్ల రవాణా జరుగుతుంది. సముద్ర రవాణాకు కీలకమైన ప్రత్యామ్నాయాలను అందిస్తుంది కూడా.