Pak Former ISI Chief Faiz Hameed arrest(Latest world news): ఐఎస్ఐ మాజీ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్ ను పాక్ సైన్యం అరెస్ట్ చేసింది. ఈ మేరకు పాకిస్థాన్ ఆర్మీ ఓ ప్రకటన చేసింది. హౌసింగ్ కుంభకోణానికి సంబంధించి అతనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నది. పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లుగా అందులో వెల్లడించింది.
‘టాప్ సిటీ కేసులో విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ పై ఫిర్యాదులపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సైన్యం అదుపులోకి తీసుకున్నది. ఆర్మీ చట్టంలోని నిబంధనల ప్రకారం హమీద్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు’ అంటూ ఐఎస్ఐ ప్రజాసంబంధాల విభాగం స్పష్టం చేసింది.
Also Read: చికెన్ ముక్కలు ఎత్తుకెళ్లిన మహిళా ఉద్యోగి.. 9 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
కాగా, పాకిస్థాన్ ఐఎస్ఐ చీఫ్ గా 2019 నుంచి 2021 వరకు పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఫయాజ్ హమీద్ ను శక్తివంతమైన వ్యక్తిగా పరిగణించేవారు. అయితే, ఇదే సమయంలో ఓ హోసింగ్ స్కీమ్ లో అవకతవకలు బయటకు వచ్చాయి. ఈ అవకతవకల విషయమై హమీద్ పై ఆరోపణలు రావడంతో ఈ ఏడాది ఏప్రిల్ లోనే పాకిస్థాన్ సైన్యం ఓ దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.