Blink Movie: కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దియా అనే డబ్బింగ్ సినిమా ద్వారా దీక్షిత్ తెలుగువారికి పరిచయమయ్యాడు. ఈ సినిమా తరువాత తెలుగులో ముగ్గురు మొనగాళ్లు, ది రోజ్ విల్లా అనే సినిమాల్లో నటించాడు కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు.
ఇక నాని హీరోగా నటించిన దసరా సినిమాలో దీక్షిత్ సెకండ్ హీరోగా నటించాడు. సూరి పాత్రలో దీక్షిత్ నటన తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా దీక్షిత్ కు ఒక గుర్తింపును తీసుకొచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాత అతని సినిమాలపై తెలుగు ప్రేక్షకులు కూడా అంచనాలను పెట్టుకుంటున్నారు. ఇక ఈ మధ్యనే దీక్షిత్.. బ్లింక్ అనే కన్నడ సినిమాలో నటించాడు.
కన్నడలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఓటీటీలో బ్లింక్ కోసం తెలుగు అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా కన్నడ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, కొన్నిరోజుల నుంచి అమెజాన్ లో ఈ సినిమా కనిపించకుండా పోయింది.
ఇక ఇప్పుడు బ్లింక్ తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు శ్రీనిధి బెంగుళూరు దర్శకత్వం వహించింది. టైం ట్రావెల్ కథగా తెరకెక్కిన ఈ సినిమా ఇక నుంచి తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ సినిమాల లిస్ట్ లో బ్లింక్ కూడా చూసెయ్యండి.