BigTV English

Chicken Wings: చికెన్ ముక్కలు ఎత్తుకెళ్లిన మహిళా ఉద్యోగి.. 9 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

Chicken Wings: చికెన్ ముక్కలు ఎత్తుకెళ్లిన మహిళా ఉద్యోగి.. 9 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

Woman Steals Kids’ Chicken Wings: చికెన్ ముక్కలను ఎత్తుకెళ్లిన ఓ మహిళా ఉద్యోగికి కోర్టు జైలు శిక్ష విధించింది. కాగా, వాటి విలువ రూ. కోట్లలో ఉంటుందంటా. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. అమెరికాలో కోవిడ్ సమయంలో పాఠశాల విద్యార్థుల కోసం ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉన్న చికెన్ వింగ్స్ ను ఓ మహిళా ఉద్యోగి పక్కదారి పట్టించింది. మొత్తంగా 1.5 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆహారాన్ని ఆమె తస్కరించినట్లు తేలింది. దీంతో ఆమెకు 9 ఏళ్ల జైలు శిక్ష పడింది.


అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో హార్వే స్కూల్ డిస్ట్రిక్ట్ ఆహార సేవల విభాగంలో వెరా లిడెల్ అనే మహిళ విధులు నిర్వహిస్తున్నది. కొవిడ్ సమయంలో వర్చువల్ పద్ధతిలో తరగతులు కొనసాగించారు. ఆ సమయంలో విద్యార్థులు, వారి కుటుంబాలకు చికెన్ వింగ్స్ తో కూడిన ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం 11 వేల కేసుల వింగ్స్ అవసరమని వారు అంచనా వేశారు. అయితే, ఇందుకోసం కేటాయించిన బడ్జెట్ కంటే అదనంగా ఖర్చు పెడుతున్నట్లు ఆడిట్ లో తేలింది. దీంతో వెంటనే అనుమానం వచ్చి అధికారులు దర్యాప్తు చేపట్టారు. వాటి నిర్వహణను చూస్తున్న వెరా లిడెల్ చేతివాటం ప్రదర్శించారనే విషయాన్ని గుర్తించారు.

Also Read: శరవేగంగా దూసుకొస్తున్న కార్చిచ్చు.. గజగజ వణుకుతున్న నాగరవాసులు


పౌల్ట్రీ నుంచి చికెన్ వింగ్స్ ను భారీ స్థాయిలో కొనుగోలు చేసి, స్కూల్ వ్యాన్ లోనే తీసుకువచ్చినప్పటికీ, విద్యార్థుల తల్లిదండ్రులకు వాటిని అందించలేదంటా. జులై 2020 నుంచి ఫిబ్రవరి 2022 వరకు ఈ తతంగం సాగినట్లుగా అధికారుల దర్యాప్తులో తేలింది. మొత్తం 15 లక్షల డాలర్ల విలువైన చికెన్ వింగ్స్ మింగేసినట్లు అధికారులు గుర్తించారు. ఆమెపై గతేడాది కేసు నమోదు చేయగా, తాజాగా ఈ కేసులో దోషిగా తేలడంతో ఆమెకు 9 ఏళ్ల శిక్ష పడినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×