E-Paper
Advertisement

Papua New Guinea: పపువా న్యూ గినియాలో ఘోరం ..26మందిని నరికేశారు!

Papua New Guinea: పపువా న్యూ గినియాలో ఘోరం ..26మందిని నరికేశారు!
Advertisement

Genocide Papua New Guinea: పసిఫిక్ దేశం పపువా న్యూ గినియాలో దారుణం చోటుచేసుకుంది. జూలై 16 నుంచి 18 మధ్య మూడు గ్రామాలపై ఓ ముఠా ఒక్కసారిగా దాడి చేసిన సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ దాడిలో 26మంది మృతి చెందారు. దుండగులు వీరిని అతికిరాతంగా నరికి చంపేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు.

మూడు గ్రామాలపై ఓ ముఠా దాడి చేసి మృతదేహాలను చెల్లాచెదురుగా పడేశారు. ఇలా పడేయడంతో సమీపంలోని మొసళ్లు కొన్ని మృతదేహాలను సరస్సులోకి లాకెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. దాడి చేసే సమయంలో కొంతమంది పారిపోయారు. దుండగులు ఇళ్లను సైతం దహనం చేయడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తలదాచుకున్నారని అధికారులు చెబుతున్నారు.

Advertisement

భూములు, సరస్సుల యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదం నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×