BigTV English

Spy Camera : బాత్‌రూంలో హిడెన్ కెమెరా.. వివాదంలో అమెజాన్

Spy Camera : బాత్‌రూంలో హిడెన్ కెమెరా.. వివాదంలో అమెజాన్

Spy Camera : పైపైన చూస్తే అదో ప్లాస్టిక్ హుక్. బాత్ రూంలో టవల్ వేలాడదీసుకునేందుకు ఉద్దేశించిన ఆ హుక్‌ను పరీక్షించి చూస్తే తప్ప అందులో నిఘా కెమెరా ఉన్నట్టు ఎవరూ గ్రహించలేరు. అంటే ఆ రహస్య కెమెరా బాత్ రూంలో మన ప్రతి కదలికనూ రికార్డు చేస్తుందన్నమాట.


నిరుడు ఓ విదేశీ విద్యార్థిని విషయంలో ఇదే జరిగింది. అప్పటికి ఆమె మైనరే. వెస్ట్ వర్జీనియా హోమ్‌లో స్నానం చేస్తున్న ఆ బ్రెజిలియన్ స్పై కెమెరా ఉన్నట్టు పసిగట్టింది. ఆ ఇంటి యజమాని తనను చిత్రీకరించేందుకే.. అమెజాన్ వెబ్‌సైట్‌లో ఆ కెమెరాను కొనుగోలు చేసి అమర్చినట్టు కోర్టుకు ఫిర్యాదు చేసింది. ఆ ఘటనపై ఆ సంస్థ ప్రస్తుతం న్యాయవివాదాన్ని ఎదుర్కొంటోంది.

ఓ వైపు ఆ కేసు నడుస్తుండగానే.. మరోవైపు హిడెన్ కెమెరాల అమ్మకం ఆ వెబ్‌సైట్‌లో కొనసాగుతుండటం తాజా విషాదం. 42.99 డాలర్ల(మన కరెన్సీలో రూ.3585)కి ఆన్‌లైన్‌లో వాటిని అమెజాన్ అమ్ముతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.


యూఎస్‌బీ చార్జర్, స్మోక్ డిటెక్టర్ తదితర రూపాల్లో హిడెన్ కెమెరాల అమ్మకం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న విషయం పత్రికల్లో వెలుగుచూసిందని బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించారు. అయినా వాటి అమ్మకాల విషయంలో అమెజాన్ తన ధోరణిని మార్చుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.

ఈ కేసును డిస్మిస్ చేయించేందుకు అమెజాన్ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. నిగూఢంగా వినియోగించే ఇలాంటి కెమెరాలను నానీ కేమ్స్(nanny cams) అని వ్యవహరిస్తారు. వీటిని ట్రాకింగ్ టాగ్స్, ఐవోటీ వంటి మినియేచర్ పరికరాల్లోనూ రహస్యంగా అమరుస్తారు. హిడెన్ కెమెరాలు అమర్చిన అలారం క్లాక్, స్మోక్ డిటెక్టర్, యూఎస్‌బీ చార్జర్లు ఆన్‌లైన్ స్టోర్లలో దొరుకుతున్నాయి.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×