E-Paper
Advertisement

Cambodia Thailand Crisis: శివుడి భారీ విగ్రహాన్ని కూల్చేసిన థాయ్‌లాండ్ సైన్యం.. అసలు ఏం జరుగుతోంది అక్కడ?

Cambodia Thailand Crisis: శివుడి భారీ విగ్రహాన్ని కూల్చేసిన థాయ్‌లాండ్ సైన్యం.. అసలు ఏం జరుగుతోంది అక్కడ?
Advertisement

Cambodia Thailand: కాంబోడియా-థాయిలాండ్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. సరిహద్దు వివాదంపై ఇరు దేశాలు దాడులకు చేసుకుంటున్నాయి. అయితే థాయ్ దళాలు కాంబోడియాకు చెందిన పురాతన హిందూ దేవాలయంలోని శివుడి విగ్రహాన్ని కూల్చివేసింది. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. థాయ్ దళాల చర్యలపై ఆగ్నేయాసియా అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 11వ శతాబ్దానికి చెందిన శివుడి ఆలయం వారసత్వం, ఖైమర్ చరిత్ర, భారతీయ నాగరికతకు ప్రతీక అని చరిత్రకారులు అంటున్నారు.

శివుడి విగ్రహం ధ్వంసం

కాంబోడియా-థాయిలాండ్ సరిహద్దులోని టా క్రాబే ఆలయంలోని శివుడి విగ్రహాన్ని భారీ ప్రొక్లెయిన్ తో కూల్చివేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కాంబోడియా అధికారులు ఈ ఘటనను సాంస్కృతిక వారసత్వ విధ్వంసంగా ఖండించారు. థాయ్ అధికారులు రక్షణాత్మక చర్యలుగా చెబుతున్నారు.

Advertisement

‘టా క్రాబే ఆలయం 11వ శతాబ్దానికి చెందినది. ఇది అంగ్కోర్-యుగం శైవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం ఆధునిక సరిహద్దుల కంటే చాలా ముందు కాలం నాటిది. ఇది సైనికులకు ప్రార్థనా స్థలం. శివుడికి అంకితం ఇచ్చిన ప్రదేశం’ అని స్థానికులు చెబుతున్నారు.

సరిహద్దు ఘర్షణలు

Advertisement

డిసెంబర్ నెలలో కాంబోడియా, థాయిలాండ్ మధ్య టా క్రాబే సమీపంలో సరిహద్దు ఘర్షణలు తలెత్తాయి. ఉద్రిక్తతలున్నా.. సాంస్కృతిక ప్రదేశాలలో సంయమనాన్ని పాటించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈ ఘటనపై భారత్ ఇంకా స్పందించలేదు. అయితే చారిత్రక ఆధారాలను ధ్వంసం చేయడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చారిత్రక వారసత్వాన్ని తరువాతి తరాలకు అందించాలని కానీ ధ్వంసం చేయకూడదంటున్నారు.

టా క్రాబే ఆలయం దెబ్బతిన్నట్లయితే, అది కాంబోడియా, థాయిలాండ్ తో పాటు యావత్ మానవాళికి నష్టమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రతీ సమస్యకు ప్రతీకారం సమాధానం కాదని, అది సంయమనం పాటించాలని కోరుతున్నారు. పవిత్రమైన ప్రదేశాలకు సంరక్షకులు అవసరమని, బుల్డోజర్లు కాదంటున్నారు.

Also Read: Trump Christmas Offer: ట్రంప్ క్రిస్మస్ ఆఫర్.. అక్రమ వలసదారులకు ఊహించని గిఫ్ట్, ఎంతో తెలుసా?

అసలు కారణం ఇదీ?

థాయ్‌లాండ్‌లోని బురిరామ్ ప్రాంతంలోని “ఫనోమ్ రుంగ్” లో ఓ ప్రైవేట్ ధ్యాన కేంద్రం యజమాని ఈ భారీ శివుడి విగ్రహాన్ని, ఇతర కట్టడాలను నిర్మించారు. ఈ నిర్మాణాలు థాయ్‌లాండ్ పురావస్తు శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అలాగే ఇవి కాంబోడియాలోని ప్రసిద్ధ అంగ్ కోర్ వాట్ ఆలయ శైలిని పోలి ఉన్నాయని థాయ్ అధికారులు గుర్తించారు. కాంబోడియా ప్రజలు ఈ నిర్మాణం తమ దేశ వారసత్వాన్ని కాపీ కొట్టడమేనని సోషల్ మీడియాలో విమర్శించారు. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు రాకుండా థాయ్ సైన్యం వాటిని ఈ విగ్రహాన్ని కూల్చివేసింది. గతంలో “ప్రీ విహియర్” ఆలయం విషయంలో ఈ రెండు దేశాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.

Related News

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

Big Stories

Advertisement
×