E-Paper
Advertisement

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు
Advertisement

Kuwait Airport: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తాజాగా కువైట్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై మిస్సైళ్లతో విరుచుకుపడింది ఇరాన్.  ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. పరిస్థితి గమనించిన  ఎయిర్ పోర్టు అథారిటీ..   విమాన రాకపోకలను నిలిపి వేసింది. ఈ విషయాన్ని కువైట్ అధికారులు వెల్లడించారు.

కువైట్‌ ఎయిర్‌పోర్ట్ పై ఇరాన్ భీకర దాడులు

Advertisement

గల్ఫ్‌లో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యాయి. బుధవారం వేకువ జామున నుంచి ఇరాన్ దాడులు మొదలుపెట్టింది. ముఖ్యంగా అమెరికా స్థావరాలపై ఫోకస్ చేసిన ఇరాన్, తీవ్రంగా దెబ్బకొట్టింది. తాజాగా బుధవారం మధ్యాహ్నం కువైట్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు దిగింది. దీంతో ఎయిర్ పోర్టులో మంటలు చెలరేగాయి.

ఎటు చూసినా బూడిద రంగు వాతావరణం కనిపించడంతో అక్కడ ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు నష్టం జరిగిపోయింది. ఈ దాడులు పలువురు గాయపడినట్టు అంతర్జాతీయ మీడియలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కువైట్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలను అధికారులు రద్దు చేశారు.

Advertisement

ఎగిసిపడిన మంటలు.. ప్రయాణికులు పరుగులు, పలు విమాన సర్వీసులు రద్దు

ఈ దాడిలో ఎయిర్‌పోర్టు ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆ దేశ సైన్యం వెల్లడించింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. పలు విమానాల రాకపోకలను నిలిపి వేసింది. ఈ విషయాన్ని కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. అక్కడికి రావాల్సిన పలు విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించినట్లు తెలియజేసింది.

దాడుల కారణంగా కువైట్ అధికారులు వెంటనే దేశ గగనతలాన్ని మూసివేశారు. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  భద్రతా తనిఖీలు పూర్తయ్యే వరకు కార్యకలాపాలు నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇరాన్‌లోని పలు దీవులపై గడిచిన నాలుగైదు రోజులుగా అమెరికా వైమానిక దాడులకు దిగింది.

ALSO READ: మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

దీనికి ప్రతీకారంగా గల్ఫ్‌ దేశాలపై దాడులు చేసినట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది. కువైట్‌లోని అల్ సలేమ్, బహ్రెయిన్‌లోని ఈసా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలిపింది.  హర్మూజ్ జలసంధి భద్రతకు ముప్పు వాటిల్లితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×