E-Paper
Advertisement

ట్రంప్ టారిఫ్ రీఫండ్.. అమెరికా చరిత్రలో అతి పెద్దది, ఏకంగా 15 లక్షల కోట్లు వెనక్కి, ఆ నిధులు ఎవరికి వస్తాయి?

ట్రంప్ టారిఫ్ రీఫండ్.. అమెరికా చరిత్రలో అతి పెద్దది, ఏకంగా 15 లక్షల కోట్లు వెనక్కి, ఆ నిధులు ఎవరికి వస్తాయి?
Advertisement

America Tariff Refunds: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ వ్యవహారంగురించి కొత్త న్యూస్. అధ్యక్షుడు విధించిన టారిఫ్ చట్ట విరుద్ధమని ఆదేశ సుప్రీం కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో టారిఫ్‌ల పేరిట వసూలు మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు రెడీ అయ్యింది అమెరికా ప్రభుత్వం. సుమారు 166 బిలియన్ డాలర్ల విలువైన సుంకాల నిధులను వాపసు చేయనుంది. ఈ నిధులు ఎవరికి దక్కనున్నాయి?

అమెరికా ట్రంప్ టారిఫ్‌ల రీఫండ్ మొదలు

Advertisement

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లపై రిఫండ్ కార్యక్రమం మొదలైంది. ఈ విధంగా టారిఫ్‌లు విధించడం రాజ్యాంగ విరుద్ధమని ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ట్రంప్ సర్కార్ సుమారు 166 బిలియన్ డాలర్ల విలువైన నిధులను వాపసు పనిలో పడింది. ఇండియన్ కరెన్సీలో దాదాపు 15 లక్షల కోట్లు అన్నమాట. ఈ విధంగా రీఫండ్ ఇవ్వడం అమెరికా చరిత్రలో అతి పెద్దది.

యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆన్‌లైన్ పోర్టల్‌ని ప్రారంభించింది. సోమవారం ఉదయం నుంచి 3.3 లక్షల మంది దిగుమతిదారులు క్లెయిమ్‌లను దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చింది. ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారా రీఫండ్ బదిలీ చేస్తున్నారు. వేగంగా డబ్బు తిరిగి చెల్లించే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

Advertisement

ఏకంగా 15 లక్షల కోట్లు వెనక్కి.. వస్తువులు కొనుగోలు చేసినవారి పరిస్థితి ఏంటి?

అమెరికా ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు.. దాదాపు 15 లక్షల కోట్లు చెల్లించనుంది. ఏప్రిల్‌ 14 నాటికి 56,497 సంస్థలు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్నాయి. రిఫండ్‌ ఫైలింగ్‌కు అర్హత సాధించినట్లు అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. కొత్తి కంపెనీలు కన్సాలిడేటెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ ఆఫ్‌ ఎంట్రీస్‌ ద్వారా షిప్‌మెంట్, టారిఫ్‌ చెల్లింపులను ఫైల్‌ చేయాలి.

దిగుమతిదారులు దరఖాస్తు ఆమోదం తర్వాత 60 నుంచి 90 రోజుల్లో నిధులు వాపసు ఇవ్వనుంది. ఏమైనా సాంకేతిక సమస్యలుంటే ఆలస్యం కావచ్చని చెబుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఇస్తున్న రీఫండ్ వినియోగదార్లకు లభిస్తుందా? అన్నదే అసలు ప్రశ్న. వివిధ దేశాల నుంచి వచ్చిన ఉత్పత్తులపై విధించిన టారిఫ్‌లు తొలుత దిగుమతిదారులు చెల్లించారు.

ALSO READ: అమెరికాలో అంతర్జాతీయ ఆయుధాల కుట్ర.. ఇరాన్‌తో డీల్స్ చేస్తున్న షమీమ్ మాఫీ అరెస్ట్!

ఆ తర్వాత ఆ వస్తువులను విక్రయించినప్పుడు అధిక ధరలకు వినియోగదారులకు విక్రయించేవారు. ఆ లెక్కన ఆ మొత్తాన్ని వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కంపెనీలు స్వచ్ఛందంగా తమకు అందే రిఫండ్‌ను వినియోగదార్లకు ఇవ్వాలి. డెలివరీ దిగ్గజ కంపెనీలు రిఫండ్‌ వచ్చిన వెంటనే వినియోగదార్లకు వాటిని బదిలీ చేస్తామని చెబుతున్నాయి.

Related News

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

హర్మూజ్‌ జలసంధిలో యుద్ధమేఘాలు.. రాకెట్ల సాయంతో సముద్రంలోకి సీమైన్స్‌, పేల్చిన అమెరికా

Big Stories

Advertisement
×