BigTV English

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Myanmar Floods: టైఫూన్ యాగీ ప్రభావం ఇప్పుడు మయన్మార్ పై పడింది. టైఫూన్ ప్రభావంతో అక్కడ వరదలు సంభవించాయి. ఇప్పటి వరకూ 74 మంది మరణించగా.. మరో 89 మంది గల్లంతయ్యారు. ఆగ్నేయాసియాలో టైఫూన్ యాగీ కారణంగా మృతి చెందినవారి సంఖ్య 350కి చేరింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మయన్మార్ లో ఇప్పటి వరకూ 2,40,000 మంది నిరాశ్రయులయ్యారు. వియత్నాం, నార్త్ థాయ్ లాండ్, లావోస్ విధ్వంసం సృష్టించిన యాగీ.. ఇప్పుడు యాగీని నాశనం చేసింది.


2021 నుంచి మయన్మార్ లో సైనిక తిరుగుబాటు సంఘర్షణలు జరుగుతుండగా.. అంతర్జాతీయ సహాయాన్ని అభ్యర్థించింది అక్కడి ప్రభుత్వం. శుక్రవారం సాయంత్రం వరకూ దేశంలో వరదల కారణంగా 74 మంది మరణించినట్లు గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్ పేర్కొంది. యూఎన్ శరణార్థి ఏజెన్సీ చెప్పిన వివరాల ప్రకారం.. 3.4 మిలియన్ల మంది వలసలు వెళ్లారు. అక్కడ జరుగుతున్న యుద్ధం, అశాంత వాతావరణమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు వరదల కారణంగా.. రాజధాని నైపిడా చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు విస్తారమైన వ్యవసాయ భూములు సైతం వరద నీటిలో మునిగాయి. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. మొబైల్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు.

Also Read: నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి


సౌత్ మయన్మార్ లో ఉన్న సిట్టాంగ్, బాగో నదులు ఇప్పటికే ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని అక్కడి మీడియా పేర్కొంది. మధ్య, తూర్పు మయన్మార్ ప్రాంతాల్లో వరదల కారణంగా 24 వంతెనలు తెగిపోయాయి. 375 పాఠశాలలు, 5 ఆనకట్టలు, 14 ట్రాన్స్ ఫార్మర్లు, 456 విద్యుత్ స్తంభాలు, 4 ఆలయాలు, 65 వేలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. వరదల కారణంగా నిరాశ్రయులైన వారికోసం 82 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇంకా భారీ వర్షసూచన ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మయన్మార్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

 

Related News

Donald Trump: చైనాపై సింపతీ.. ట్రంప్ ఆంతర్యం ఏంటి?

Trump – Putin: ట్రంప్ ఉండి ఉంటే.. ఉక్రెయిన్‌తో యుద్ధమే జరిగేది కాదు.. పుతిన్ కీలక వాఖ్యలు

Trump, Putin Meeting: తగ్గేదే లే..! ట్రంప్, పుతిన్ చర్చించిన అంశాలు ఇవే..

Trump and Putin: ట్రంప్, పుతిన్ భేటీపై ఉత్కంఠ..! ఎవరి పంతం నెగ్గుతుంది..

America-Russia: అమెరికా-రష్యా చర్చలు విఫలమైతే భారత్ ని బాదేస్తాం.. తల, తోక లేని ట్రంప్ వార్నింగ్

Tsunami: నిశబ్దంగా.. 100 అడుగుల ఎత్తైన కెరటాలతో ముంచెత్తిన సునామీ, భారీ విధ్వంసం

Big Stories

×