BigTV English
Advertisement

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

Nigeria boat accident : నైజీరియాలో బోటు ప్రమాదం..64 మంది మృతి

64 people feared dead as boat capsizes in Nigeria: నైజీరియాలో 6 రోజుల క్రితం జరిగిన ట్రక్కు-ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలో 48 మంది మృతి చెందారు. ఈ సంఘటన మరవక ముందే నైజీరియా దేశంలో మరో ఘోరమైన దుర్ఘటన జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బోటు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 64 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన సంఫారా రాష్ట్రంలో జరిగింది. స్థానిక గుమ్మి పట్టణానికి చెందిన డెభ్బై మంది రైతులు వ్యవసాయ పనులు చేసుకోవడానికి పడవలో వెళుతుండగా ప్రమాదవశాత్తూ ఈ దుర్ఘటన జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి రెస్క్యూ సహాయక బృందాలను పంపించారు. అతి కష్టం మీద ఆరుగురు ప్రాణాలను రెస్క్యూ సిబ్బంది కాపాడగలిగారు. మిగిలినవారు గల్లంతయ్యారు. గతంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. కాగా పడవలో ఉన్న వారి పేర్లు, వివరాలు తెలియలేదు. గల్లంతయిన వారి కోసం తీవ్రంగా వెదుకుతున్నారు రెస్క్యూ టీమ్. ఈ నదిపై ఎప్పటినుంచో వంతెన కట్టాలని ప్రజలు కోరుకుంటున్నా అధికారులు ఎవరూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకపోవడంతో..ప్రజలు నిత్యం పడవలనే ఆశ్రయించాల్సి వస్తోంది.


వ్యవసాయ పనుల కోసం

రోజుకు వెయ్యి మందికి పైగా ఈ పడవలలో ప్రయాణిస్తుంటారు. అందరూ వ్యవసాయ పనుల కోసం అవతల ఒడ్డుకు చేరుకుని సాయంత్రం దాకా పనిచేసుకుని తిరిగి మళ్లీ పడవలలో తమ ప్రాంతానికి చేరుకుంటారు. అయితే శనివారం కూడా అదే మాదిరిగా ఉపాధి కోసం తప్పనిసరి పరిస్థితిలో నదిని దాటవలసి వచ్చింది. ఆ సమయంలో నదిలో నీటి ఉధృతి బాగా ఉంది. పడవలో పరిమితి నిబంధనలు పాటించకుండా ఎక్కువ మందిని తీసుకెళ్లడమే ప్రమాదానికి మూల కారణమయింది. కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ప్రమాదానికి కారణం ఏమిటి? ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని అధికారులను కోరారు. మృతి చెందిన వారికి పరిహారం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఓ వంతెన ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.


Related News

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Donald Trump: పాక్ అణ్వాయుధాలను టెస్ట్ చేస్తుందా? మళ్లీ యుద్ధం స్టార్ట్..!

Big Stories

×