పాడి కౌశిక్ రెడ్డి.. తన నోటిదురుసుతో నిత్యం వార్తల్లో నిలిస్తుంటారు. తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన చుట్టూ ఎన్నో వివాదాలు. వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం కోసమో, ఏమో గానీ.. మొదట్నించి కౌశిక్ రెడ్డి తన అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ.. వివాదాదస్పదమవుతున్నారు. అప్పట్లో గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యల దగ్గర నుంచి ఇప్పుడు అరికపూడి గాంధీతో వివాదం వరకు కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిపై సొంత పార్టీ నేతలే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.
బీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి కౌశిక్ రెడ్డి తన నోటికి పనిచెప్తూ వస్తున్నారు. ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది. దానికి తోటు బీఆర్ఎస్ అధిష్టానం కూడా కౌశిక్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోకపోవడంతో తన నోటిదురుసు మరింత పెరిగింది. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి అయిన తర్వాత కూడా కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ప్రజలకు ఓ రోల్ మోడల్ గా ఉండాల్సింది పోయి.. తన నోటిదురుసుతో వివాదాస్పదమవుతూ వస్తున్నారు.
Also Read: హైదరాబాద్ గణేశ్ నిమజ్జనాలపై దుష్ప్రచారం.. మంత్రి పొన్నం క్లారిటీ
ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై MLA కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్దం.. హద్దులు దాటి వ్యక్తిగత దాడులు చేసుకునే స్థాయికి చేరింది. సవాళ్లు. .ప్రతి సవాళ్లతో పొలిటికల్ డ్రామా నడిచింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో మూడు కేసులు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.
ఎమ్మెల్యే గాంధీ తనకు ఇంటికి వచ్చి.. తనపై దాడి చేసేందుకు యత్నించారని.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో ఆయనపై హత్యాయత్నం కేసుతో నమోదు చేశారు. దాంతో మరో కేసు కూడా ఫైల్ చేశారు.
ఇక ఈ వ్యవహారంలో MLA కౌశిక్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యేలపై మొత్తం మూడు కేసులు నమోదు అయ్యాయి.