E-Paper
Advertisement

8.5 రేటింగ్ తో ఓటీటీని అల్లాడిస్తున్న మలయాళం మూవీ… తెలుగులోనూ స్ట్రీమింగ్

8.5 రేటింగ్ తో ఓటీటీని అల్లాడిస్తున్న మలయాళం మూవీ… తెలుగులోనూ స్ట్రీమింగ్
Advertisement

Malayalam Comedy Drama: ఫ్యామిలీ అంతా కలిసి వీకెండ్ ఓ మంచి కుటుంబ కథా చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఇందులో కడుపుబ్బా నవ్వించే కామెడీతో పాటు, ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే అంశాలన్నీ ఉంటాయి. ఐఎండీబీలోనూ ఈ సినిమాను అదిరిపోయే రేటింగ్ ఉంది. ఏకంగా 8.5 రేటింగ్ తో ఓటీటీని షేక్ చేస్తున్న ఈ మలయాళం సినిమా పేరు ‘వాజా II: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్’ (Vaazha II: Biopic of a Billion Bros 2026)’. 2026లో విడుదలై మలయాళ సినిమా ప్రేమికులను మళ్లీ ఆకట్టుకున్న ఈ యూత్‌ఫుల్ కామెడీ డ్రామాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఉందా లేదా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

హాషిర్, అలన్, అజిన్, వినాయక్… మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఈ నలుగురు ప్రాణ స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. సమాజం, స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు వీరిని ఎందుకూ పనికిరాని అవారా కుర్రాళ్లుగా భావిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు చదువు కంటే గొడవల్లోనే ఎక్కువగా ముందుంటారు. కానీ వాళ్ళ మధ్య స్నేహం అన్నదమ్ముల బంధం కంటే ఎక్కువగా ఉంటుంది. ఒకరి కోసం ఒకరు ఏమైనా చేయడానికి సిద్ధమై ఉంటారు. ఒకరోజు అలన్ సోదరి ఆష్నా క్లాస్ ఎగ్గొట్టి థియేటర్‌కు వెళ్లినప్పుడు ముజీబ్ అనే టీచర్ ఆమెను పట్టుకుని తల్లిదండ్రుల ముందే తీవ్రంగా అవమానిస్తాడు. దీంతో కోపం తట్టుకోలేక అలన్, హాషిర్‌లు కలిసి ఆ టీచర్‌పై దాడి చేస్తారు.

Advertisement

ఆ తర్వాత ఒక షాప్‌కీపర్ దగ్గర డ్రగ్స్ విషయంలో జరిగిన మరో గొడవలో మనోజ్ సర్ అనే టీచర్‌కు అనుకోకుండా గాయాలవుతాయి. ఈ గొడవల వల్ల వీరిని స్కూల్ నుండి సస్పెండ్ చేసే పరిస్థితి వస్తుంది. ఈ క్లిష్ట సమయంలో డీవైఎస్పీ జేవియర్ అలెగ్జాండర్ (దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ ప్రత్యేక పాత్రలో) రంగంలోకి దిగుతాడు. అతను ఈ గొడవలకు కేవలం పిల్లలే కారణం కాదని, టీచర్ల ప్రవర్తన, తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఉందని తేల్చి, పిల్లలకు సర్దిచెప్పి పరీక్షలు రాసేలా సహాయం చేస్తాడు. అదే సమయంలో వారి జీవితాల్లోకి లవ్ ఎంట్రీ ఇస్తుంది. పరీక్షల అనంతరం ఈ నలుగురు స్నేహితులు విడిపోతారు.

హాషిర్ పరీక్షల్లో ఫెయిల్ అయి ఇండియాలోనే ఉండిపోగా, అజిన్ తన అన్నయ్య సహాయంతో దుబాయ్ వెళ్తాడు. అలన్, వినాయక్‌లు ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం యూకే వెళ్తారు. అక్కడ విదేశీ వాతావరణానికి అలవాటు పడటానికి వారు పడే కష్టాలు, ఒకరినొకరు మిస్ అవ్వడం కథను ఎమోషనల్‌గా మారుస్తుంది. వినాయక్ తండ్రి కాలేయ వ్యాధితో మరణించడంతో నలుగురు మిత్రులు మళ్లీ కలుస్తారు. మరి ఆ తరువాత నలుగురు స్నేహితులు కలిసి చేసిన పని ఏంటి ? దుబాయ్ లో అజీన్ పడిన కష్టాలు ఏంటి ? మిగతా ఇద్దరు స్నేహితులు ఫారిన్ నుంచి ఎందుకు ఇంటికి వచ్చేయాలి అనుకుంటారు ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

తెలుగులోనూ ఉంది

Advertisement

ఈ ఫ్రాంచైజీలో మొదటి భాగం ‘వాజా: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బాయ్స్’ భారీ విజయం సాధించింది. తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ కేవలం 10 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, బాక్సాఫీస్ వద్ద 230 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. జీవితంలో ఓడిపోయినట్టు కనిపించే కుర్రాళ్లు ఎలా సరైన మార్గం వెతికి, విజయం సాధించారనే కథను ఇందులో హృదయానికి హత్తుకునేలా చెప్పారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా JioHotstarలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది.

Read Also: పగటిపూట సైలెంట్ రాత్రైతే వయోలెంట్ ఈ పిల్ల… నలుగురు సార్ల ఎంట్రీతో ట్విస్ట్

Tags

Related News

వయసు 50 దాటినా యాక్షన్‌లో తగ్గేదేలే… పాత గూఢచారులు మళ్లీ రంగంలోకి… అదిరిపోయే కొరియన్ యాక్షన్ కామెడీ సిరీస్

కాబోయే భార్యకు కుక్కలంటే అలర్జీ… ప్రాణంగా పెంచుకున్న పెట్‌ను ఏం చేశాడంటే ? డాగ్ లవర్స్ డోంట్ మిస్

గ్రామంపై భారీ కొండచిలువ దాడి.. దాన్ని చంపేందుకు 3 రోజుల డెడ్‌లైన్… చైనీస్ మాన్‌స్టర్ థ్రిల్లర్ తెలుగులో

గతం మర్చిపోయిన సూపర్ హీరో… పట్టిస్తే భారీ నజరానా… ఈ సిరీస్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

Big Stories

Advertisement
×