E-Paper
Advertisement

US Tariffs: ప్రపంచ దేశాలపై యూఎస్ 10 శాతం సుంకాలు.. భారత్ కు భారీ ఊరట

US Tariffs: ప్రపంచ దేశాలపై యూఎస్ 10 శాతం సుంకాలు.. భారత్ కు భారీ ఊరట

US Tarrifs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు.. ఆ దేశ సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్ లు చట్టవిరుద్ధమని ప్రకటించింది. దేశాలపై టారిఫ్ లు విధించే హక్కు అధ్యక్షుడికి లేదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఫైర్ అవుతున్న డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ దేశాలపై మళ్లీ 10 శాతం టారిఫ్‌లు విధించారు. ఈ టారిఫ్ లకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ తాజాగా సంతకం చేశారు. 10 శాతం టారిఫ్ లు వెంటనే అమల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌ ట్రంప్ పోస్ట్‌ చేశారు.

సిగ్గుండాలి..రెచ్చిపోయిన ట్రంప్

సుప్రీంకోర్టు తీర్పు, తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై డొనాల్డ్ ట్రంప్‌ మండిపడ్డారు. ప్రపంచ దేశాలకు అత్యంత ఆమోదయోగ్యమైన రీతిలో తాము విధించిన టారిఫ్‌లను సుప్రీంకోర్టులోని కొందరు జడ్జిలు వ్యతిరేకించారు. ఈ తీర్పునకు వారు సిగ్గుపడాలన్నారు. ఇది చాలా హాస్యాస్పదమైన తీర్పు అన్నారు. టారిఫ్‌ లకు సంబంధించిన సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించామన్నారు. గతంలో టారిఫ్ ల కంటే మరింత ఎక్కువ వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.

టారిఫ్ లపై సుప్రీంకోర్టు తీర్పుపై చట్ట విరుద్ధమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అన్నారు. దిగుమతులను నియంత్రించే అధికారం అధ్యక్షుడికి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు దానిని అడ్డుకుంటుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో అమెరికా పరిశ్రమలు, మార్కెట్లను రక్షించే అవకాశం లేకుండా పోతుందన్నారు. అమెరికన్ల ఉద్యోగ భద్రత, మార్కెట్ ప్రాధాన్యాలను ముందుకు తీసుకెళ్లడం కోసం ట్రంప్ నకు విస్తృత అధికారాలున్నాయని జేడీ వాన్స్‌ అన్నారు.

ఇంకా అధిక సుంకాలు

డొనాల్డ్ ట్రంప్‌కు ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలను శుక్రవారం అమెరికా సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. సుంకాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు బెంచ్ 6–3 తేడాతో తీర్పు ఇచ్చింది. ట్రంప్ సుంకాలను ఆరుగురు న్యాయమూర్తులు వ్యతిరేకించగా, ముగ్గురు అనుకూలంగా ఓటు వేశారు. ఈ తీర్పు ‘దేశానికి అవమానం’ అని ట్రంప్ వర్ణించారు. విదేశీ ప్రయోజనాలు, రాజకీయ ఉద్యమాలకు మద్దతుగా ఈ తీర్పు ఉందన్నారు. అవసరమైతే, ది ట్రేడ్ ఎక్స్‌పాన్షన్ యాక్ట్ 1962తో సహా మరో మూడు చట్టాలతో ఇంకా ఎక్కువ సుంకాలను వసూలు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.

Also Read: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

భారత్ కు భారీ ఊరట

సుప్రీంకోర్టు తాజా తీర్పుతో భారత్ కు ఉపశమనం కలగనుంది. ఈ తీర్పు దేశ వాణిజ్య విధానాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో..అమెరికా 150 రోజుల పాటు సుంకాలను 10%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ కూడా ఉండడంతో ఉపశమనం కలగనుంది. భారత్ ప్రస్తుతం 18 శాతం సుంకాలు చెల్లిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ఆర్డర్ తో భారత్ సహా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న దేశాల సుంకాల రేట్లను 10%కి తగ్గుతాయని వైట్ హౌస్ అధికారులు స్పష్టం చేశారు. తాత్కాలిక టారిఫ్ లు 150 రోజుల పాటు అమల్లో ఉంటాయని ప్రకటించింది. తాత్కాలిక టారిఫ్ లు ఫిబ్రవరి 24 అర్ధరాత్రి 12:01 గంటలకు అమల్లోకి రానున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు, అమెరికా టారిఫ్ లు 10 శాతానికి తగ్గుతుండడంతో యూఎస్ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×