E-Paper
Advertisement

Aadi Reddy -Geethu Royal: గీతూ రాయల్  వివాదం పై ఆదిరెడ్డి రియాక్షన్..తప్పుచేసిందంటూ !

Aadi Reddy -Geethu Royal: గీతూ రాయల్  వివాదం పై ఆదిరెడ్డి రియాక్షన్..తప్పుచేసిందంటూ !
Advertisement

Aadi Reddy -Geethu Royal: బిగ్ బాస్ గీతూ రాయల్ తిరుమల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈమె ఇటీవల తన టీంతో కలిసి తిరుమల వెళ్లారు అయితే అక్కడ ఈమె రీల్స్ చేయడంతో పెద్ద ఎత్తున వివాదంలో నిలిచారు. గీతు రాయల్(Geethu Royal) రీల్స్ చేయడమే కాకుండా వాటిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి దీంతో ఈమె వీడియోలు డిలీట్ చేసినప్పటికీ అప్పటికే సోషల్ మీడియాలో ఈ వీడియోలో వైరల్ గా మారడంతో ఈమెపై చర్యలు తీసుకోవాలి అంటూ స్వామి వారి భక్తులు సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోలపై గీతు రాయల్ వివరణ కూడా ఇచ్చారు.

తిరుమలలో రీల్స్.. మండిపడుతున్న భక్తులు..

ఇలా ఆమె వివరణ ఇచ్చినప్పటికీ తిరుమల దేవస్థాన పరిసర ప్రాంతాలలో రీల్స్ చేయడం నిషేధం. ఇలా నిషేధిత ప్రాంతాలలో రీల్స్ చేస్తూ ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు ఇలాంటి వారిపై టీటీడీ కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ రీల్స్ పై కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ఆదిరెడ్డి (Aadi Reddy)ఈ విషయంపై స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు .అయితే గత కొద్ది రోజుల క్రితం 100 డేస్ ఛాలెంజ్ లో భాగంగా కొంతమంది తిరుమల మెట్లపై రీల్ చేయడంతో ఆదిరెడ్డి స్పందించి ఒక వీడియో చేశారు. అయితే ఇప్పుడు గీతు రాయల్ విషయంలో ఎందుకు రీల్స్ చేయలేదు అంటూ చాలామంది తనపై కామెంట్లు చేయడంతోనే ఈ వీడియో చేస్తున్నానని తెలిపారు..

గీతూ చేసింది ముమ్మాటికి తప్పే..

Advertisement

గీతు రాయల్ తిరుమలలో ఇలా రీల్స్ చేయడం తప్పు. ఈ విషయాన్ని గీతూ రాయల్ కూడా చెప్పారు అది ఎవరు చెప్పినా, చెప్పకపోయినా తను చేసింది ముమ్మాటికి తప్పే. అయితే గీతూ ఈ వీడియో అప్లోడ్ చేయగానే తాను వెంటనే గీతూ రాయల్ కు మెసేజ్ చేశాను అంటూ ఈయన మెసేజ్ కూడా చూపించారు. ఇలా ఎంతోమంది భక్తుల నమ్మకం అయిన తిరుమల స్వామివారి సన్నిధిలో రీల్స్ చేయడం తప్పు అంటూ తాను గీతు రాయల్ కు మెసేజ్ చేయడంతోనే ఆమె వెంటనే వీటిని డిలీట్ చేసిందని క్లారిటీ ఇచ్చారు.

?igsh=aXpyNGdkZ2Z4YjQ%3D

Advertisement

తిరుమల కొండపై, స్వామి వారి ఆలయం ఎదుట అలిపిరి మెట్ల మార్గంలో ఎవరు రీల్స్ చేసిన అది తప్పే. నేనైనా, గీతూ రాయల్ అయిన మీరైనా, ఇలా స్వామివారి సన్నిధిలో రీల్స్ చేయడం అంటే కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్లేనని ఆదిరెడ్డి తెలిపారు. గీతూ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అలాంటి వ్యక్తి తప్పు చేస్తే వెంటనే సోషల్ మీడియాలో పెట్టకుండా తనకు పర్సనల్ గా చెప్పి ఆ వీడియోలను డిలీట్ చేయించానని తెలిపారు. ఇక మీ అందరి సమక్షంలో కూడా చెబుతున్నాను అమ్మాయి చేసింది తప్పు. అలాగే యూట్యూబర్లకు, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దయచేసి తిరుమల నిషేధిత ప్రాంతాలలో ఎవరు కూడా రీల్స్ చేసి భవిష్యత్తులో తప్పు చేయొద్దు.. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీయద్దు అంటూ ఆది రెడ్డి చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Also Read: BMW OTT: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ డేట్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Related News

సర్కార్‌ అప్పీలుపై మొదటగా స్పందించిన నాగ్‌..! కరువు పరిస్థితుల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ నుంచి సహకారం కోరిన సీఎం రేవంత్‌ రెడ్డి..ఇండస్ట్రీ నుంచి పూర్తి సహకారం అందిస్తామని ప్రకటన ..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×