BigTV English

Brother: గెటప్ బ్రదర్.. వెరైటీ వెల్‌కమ్స్.. ప్రతీరోజూ సర్‌ప్రైజ్..

Brother: గెటప్ బ్రదర్.. వెరైటీ వెల్‌కమ్స్.. ప్రతీరోజూ సర్‌ప్రైజ్..

Brother: సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అది చూస్తే చూస్తే మతిపోవాల్సిందే. తమ్ముడి కోసం అన్న వింత వింత వేషాలు వేస్తున్నాడు. రోజుకో గెటప్ వేసుకొని.. ప్రతీరోజూ తమ్ముడికి కొత్త సర్‌ప్రైజ్ ఇస్తున్నాడు.


ఆ పిల్లాడి పేరు “మాక్స్”.. స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సరికల్లా.. అతని అన్న “నోహ్” వెరైటీ గెటప్‌తో వెల్‌కమ్ చెబుతుంటాడు.

ఓ రోజు గిరిజనుడి వేషంలో ఎదురొచ్చి.. తమ్ముడి మెడలో పూలదండ వేసి ఇంట్లోకి స్వాగతం పలికాడు.


ఇంకోరోజు బ్యాట్‌మెన్ గెటప్.. సుమో ఆకారంలో ఓసారి.. గిటారిస్టుగా ఇంకోసారి.. రకరకాల బెలూన్లతో పలుమార్లు.. ఒక్కటేమిటి.. ఒక్కరోజు కూడా వదలకుండా.. ఎవ్రీ డే.. స్పెషల్ డే నే ఆ తమ్ముడికి.

వాన పడినా.. మంచు కురిసినా.. ఎండ కొట్టినా… ఆ అన్న మాత్రం తగ్గేదేలే.. గెటప్ ఆపేదేలే.

బస్సు దిగగానే తన అన్న ఏ వేషంలో వస్తాడోననే క్యూరియాసిటీ ఆ తమ్ముడిది. అన్నను చూడగానే అమాంతం మీద పడిపోతుంటాడు. హగ్ చేసుకుంటాడు. సరదాగా కొడుతూ ఆట పట్టిస్తుంటాడు. ప్రతీరోజూ పండుగే ఆ లవ్లీ బ్రదర్స్‌కి.

అన్నదమ్ముల అనుబంధం అంటే ఇదేరా అనిపించేలా ఉందా వీడియో. ఆ తమ్ముడి అదృష్టమే అదృష్టం అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మనకూ ఇలాంటి ఓ బ్రదర్ ఉంటే బాగుండు..అంటున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×