Integral Coach Factory: పదో తరగతి, ఇంటర్, ఐటీఐ పూర్తి చేసిన వారికి ఇది బంపర్ ఆఫర్ న్యూస్ అని చెప్పవచ్చు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)లో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ కూడా అందజేస్తారు. మరి ఇంకెందకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగాలు, వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2025-26 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టెన్త్ పాస్, ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వారికి రైల్వేలోని ప్రముఖ తయారీ యూనిట్‌లలో శిక్షణ పొందేందుకు ఇది అద్భుత అవకాశం అని చెప్పవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 11వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1010
వివిధ ట్రేడులో ఈ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్‌టీ రేడియాలజీ, ఎంఎల్ పాథాలజీ, పీఏఎస్‌ఏఏ ట్రేడుల్లో పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత: ట్రేడ్ ను బట్టి సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో టెన్త్ క్లాస్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) పాసై ఉంటే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 12
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 11
వయస్సు:
ఐటీఐ అభ్యర్థులకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నాన్ ఐటీఐ అభ్యర్థులకు 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
స్టైఫండ్:
సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ ఉంటుంది. నెలకు రూ.6వేల నుంచి రూ.7వేల వరకు స్టైఫండ్ ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ:
అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://icf.indianrailways.gov.in/
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1010
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 11
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి స్టైపండ్ కూడా ఇవ్వనున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: RRB Technician Jobs: శుభవార్త.. రైల్వేలో 6238 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు