Arabia Kadali OTT Release: ప్రతి వారంలో కొత్త సినిమాలు, వెబ్ సరీస్ లతో అలరిస్తున్నాయి ఒటీటీలు. భాషతో సంబంధం లేకుండ అన్ని భాష చిత్రాలను తమ రీజనల్ లాంగ్వెజ్ లో చూడోచ్చు. ఏ భాష చిత్రమైన అన్ని భాషల్లోకి వాటిని అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. దీంతో శుక్రవారం వచ్చిందంటే ఒటీటీ ప్రియులకే పండగే. ఈ నేపథ్యంలో ఒటీటీలోకి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతోంది. ప్రతి క్షణం ఉత్కంఠ పెంచుతూ సస్పెన్స్ తో థ్రిల్ చేసేందుకు ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. అదే ‘అరేబియా కడలి’. సత్యదేవ్, నటి ఆనంది ప్రధాన పాత్రల్లో సూర్య కుమార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ మరికొన్ని రోజుల్లో స్ట్రీమింగ్ కి సిద్ధమౌవుతోంది.
ఆగష్టు 8న స్ట్రీమింగ్
ఈ మేరకు దీనిపై తాజాగా ప్రముఖ ఒటీటీ సంస్థ అమెజాన్ ప్రైం అధికారిక ప్రకటన ఇచ్చింది. ఆగష్టు 8న ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నట్టు వెల్లడించింది. తెలుగుతో పాటు హిందీ, తమిల్, మలయాళం, కన్నడ భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది. మరో విశేషం ఏంటంటే దీనికి ప్రముఖ తెలుగు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడీ కథ అందించారు. అంతేకాదు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహిరించారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. ‘కాలానికి అందరూ సమానమే.. ఒడుదుడుకులు ఎవరినీ వదలవు’ అనే ట్యాగ్ లైన్ తో దీనిపై ప్రకటన ఇచ్చారు.
కథ విషయానికి వస్తే..
ఈ సిరీస్ మొత్తం సముద్రం నేపథ్యంలో సాగనుంది. రెండు గ్రామాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి.. విదేశీ బార్డర్లలో చిక్కుకుంటారు. అక్రమంగా తమ దేశంలో చొరబడ్డారనే ఉద్దేశంతో ఆ దేశం వారిని బందీలు చేసి జైల్లో వేస్తోంది. దీంతో వారిని బయటకు తీసుకువచ్చేందుకు మత్స్యకారుల నాయకుడి భార్య చేసిన పోరాటం ప్రతి ఒక్కరిని హత్తుకుంటుంది. నిజ జీవిత సంఘటన ఆధారంగా డైరెక్టర్ క్రిష్ ఈ కథను రాశారు. హ్యుమన్ ఎమోషన్స్, యాథార్థ సంఘటనలతో ఈ వెబ్ సరీస్ ఆడియన్స్ ఆకట్టుకునేలా ఉంటుందని మూవీ టీం చెబుతోంది. మరి ఆగష్టు 8న ఓటీటీకి వస్తోన్న ఈ సిరీస్ ప్రేక్షకులన ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.
తండేల్ రాజు కథతో..
అయితే ఈ కథ, కథనం చూస్తుంటే నాగ చైతన్య, సాయి పల్లవి తండేల్ మూవీకి గుర్తు చేసేలా ఉందని పిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 7న విడుదలైన బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. తండేల్ రాజు పాత్రలో చై, బుచ్చిగా సాయి పల్లవి ఎమోషన్స్ పండించారు. ప్రతి ఒక్కరిని ఈ సినిమా ఆకట్టుకుంది. లవ్, రొమాంటిక్ తో పాటు హ్యుమన్ ఎమోషనల్ గా సాగిన తండేల్ మూవీ థియేటర్లలో విడుదలైన రూ. 100 కోట్ల క్లబ్ చేరింది. ఇప్పుడు ఇదే నేపథ్యంలో వెబ్ సిరీస్ గా వస్తోన్న ‘ఆరేబియా కడలి’ ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read: Kingdom Premier: ‘కింగ్డమ్’కు మొదటి ఎదురుదెబ్బ.. నాగ వంశీకి భారీ ఎఫెక్ట్