Durga Rao: దుర్గారావు(Durga Rao) పరిచయం అవసరం లేని పేరు టిక్ టాక్(Tik Tok) వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఈయన ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు. తన భార్యతో కలిసి పెద్ద ఎత్తున డాన్స్ వీడియోలు చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా నాది నక్కలీసు గొలుసు అనే పాట ద్వారా ఈ దంపతులు ఎంతో ఫేమస్ అయ్యారు అప్పట్లో ఈ పాట ఓ ఊపు ఊపింది. ముఖ్యంగా దుర్గరావు డాన్స్ స్టెపులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తాను వేసే స్టెప్పుల్లో కామెడీని జత చేస్తూ.. అదరగొట్టేవాడు. దీంతో ఆయన వీడియోస్ అందరికీ చేరువ అయ్యాయి.
డాన్స్ వీడియోలతో ఫేమస్…
ఇలా ఎంతో ఫేమస్ అయిన ఈ దంపతులకు జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంతో పాటు ఇతర బుల్లితెర కార్యక్రమాలలో కూడా అవకాశాలు లభించాయి అలాగే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలతో పలు కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న దుర్గారావు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను అందరితో పంచుకున్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ బ్రతికిన దుర్గారావు ఇప్పుడు మాత్రం సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నారు.
యూట్యూబ్ సంపాదనతో రెండు ఇండ్లు…
ఇక ఈయన ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన యూట్యూబ్ సంపాదన గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈయన యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బుతో ఏకంగా రెండు ఇళ్లను(Two Houses) కట్టినట్టు తెలియజేశారు. ఇలా వచ్చిన డబ్బు ఖర్చు పెట్టకుండా వచ్చిన డబ్బుతో వచ్చిన విధంగా తన ఇంటిని క్రమక్రమంగా పూర్తి చేశామని తెలిపారు. అలా తన సొంత గ్రామంలోనే రెండు ఇళ్లను కట్టినట్టు ఈయన తెలియచేశారు. ఇలా రెండు ఇళ్లను కట్టానని చెప్పడంతో ఈయన యూట్యూబ్ ఆదాయం(Youtube Income) గురించి కూడా ప్రశ్న ఎదురయింది. యూట్యూబ్ ద్వారా తనకు నెలకు 30 నుంచి 40 వేల రూపాయలు వరకు ఆదాయం వస్తుందని తెలిపారు.
బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వండి…
ఇక ఏదైనా షూటింగ్స్ వుండి యూట్యూబ్ వీడియోలు చేయకపోయినప్పుడు ఒక్కోసారి 10000 కూడా రాదని ఒక్కోసారి లక్ష రూపాయలు వరకు కూడా వస్తుందని తెలిపారు. ఇలా అంతా బెరీజు చేసుకుంటే నెలకు 30 నుంచి 40 వేల రూపాయల ఆదాయం వస్తుందని దుర్గారావు తెలిపారు. ఇలా 40 వేల ఆదాయంతో ఈయన ఏకంగా రెండు ఇండ్లను కట్టారని తెలిసిన అభిమానులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న దుర్గారావు ఇటీవల బిగ్ బాస్(Big Boss) కార్యక్రమంలోకి వెళ్లాలని ఉందని బిగ్ బాస్ లోకి వెళ్లడానికి తాను పూర్తిగా అర్హుడని, తనకు బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం ఇవ్వాలి అంటూ కోరిన సంగతి తెలిసిందే. మరి ఈయన కోరిక మేరకు బిగ్ బాస్ లో అవకాశమిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: War 2 Film: అదంతా ఫేక్…ప్రీ రిలీజ్ ఈవెంట్ పై స్పందించిన వార్ 2 టీమ్!