E-Paper
Advertisement

AAI Recruitment: డిగ్రీ పాసైన వారికి సువర్ణవకాశం.. ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగ అవకాశాలు, మంచి వేతనం

AAI Recruitment: డిగ్రీ పాసైన వారికి సువర్ణవకాశం.. ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగ అవకాశాలు, మంచి వేతనం
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. చాలా రేర్ వచ్చే నోటిపికేషన్లలో ఇది ఒక్కటి.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయితే ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నార్తర్న్ రీజియన్ పరిధిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారికి ఇది బంగారు భవిష్యత్తు లాంటి దని చెప్పవచ్చు. డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసైన వారందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ప్రక్రియ విధానం, తదితర విధానాల గురించి క్లియర్ కట్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), నార్తర్న్ రీజియన్ పరిధిలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 22న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 133

పోస్టుల వివరాలు: ఇందులో వివిధ రకాల పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్, ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెకానికల్/ఆటోమొబైల్, బీసీఏ, స్టెనో, కోపా విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా/ఐటీఐ/డిగ్రీలో పాసై ఉండాలి. ఈ అర్హత ఉన్న వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

వయస్సు: 2026 మార్చి 31 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జీతం: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు రూ.25,500 జీతం ఉంటుంది. డిప్లొమా అప్రెంటీస్‌లకు రూ.20,000 జీతం ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: 2026 మార్చి 22

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకోవచ్చు. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.aai.aero/

ALSO READ: SBI Notification: రూ.లక్షల్లో జీతాలు, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, దరఖాస్తుకు చివరి తేది ఇదే..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×