E-Paper
Advertisement

AIIMS DELHI: పదో తరగతి అర్హతతో 1383 ఉద్యోగాలు.. ఎగ్జామ్ పాసైతే చాలు, జాబ్ మీదే

AIIMS DELHI: పదో తరగతి అర్హతతో 1383 ఉద్యోగాలు.. ఎగ్జామ్ పాసైతే చాలు, జాబ్ మీదే

AIIMS DELHI: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ న్యూ ఢిల్లీ నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.  పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీలో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ న్యూ ఢిల్లీ(AIIMS DELHI) దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ హాస్పిటల్స్‌, కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలో రెగ్యులర్‌ విధానంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,383 గ్రూప్‌-బీ, సీ ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2025 డిసెంబర్‌ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోండి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1383

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ న్యూ ఢిల్లీలో వివిధ రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. గ్రూప్- బీ, సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీ వివరాలు..

అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌: 121
అసిస్టెంట్‌ స్టోర్స్‌ ఆఫీసర్: 102
 ల్యాబ్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-2/టెక్నీషియన్‌: 80
 జూనియ్ స్కేల్ స్టెనో(హిందీ): 71
 టెక్నీషియన్‌ (రేడియాలజీ): 105
 సీనియర్ నర్సింగ్‌ ఆఫీసర్‌: 121
 ఫిజియోథెరపిస్ట్‌/జూనియర్‌ ఫిజియోథెరపిస్ట్‌: 46
సానిటరీ ఇన్‌స్పెక్టర్‌/సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ జీడీ: 33
 ఫార్మసిస్ట్‌/ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌-2: 35
అసిస్టెంట్‌ డైటీషియన్‌: 17

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీలో పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను పరిగణలోకి తీసుకుంటారు.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 నవంబర్ 14

దరఖాస్తుకు చివరి తేది: 2025 డిసెంబర్ 2

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉండును.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3,000 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2,400 ఫీజు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://aiimsexams.ac.in/

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1383

దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 2

ALSO READ: Congress: తెలంగాణలో ఓట్ చోరీ జరిగింది.. వోట్ చోరీపై సంతకాల సేకరణ చేపడుతాం: టీపీసీసీ అధ్యక్షుడు

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×