NTPC Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. డిగ్రీతో పాటు డిప్లొమా లేదా పీజీ డిగ్రీ లేదా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా హాస్పిటల్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ పాసైన వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) లో ఫిక్స్ డ్ టర్మ్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
న్యూఢిల్లీ, దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) లో ఫిక్స్ డ్ టర్మ్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 25వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు
ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్) : 15 ఉద్యోగాలు
కేటగిరి వారీగా పోస్టులు..
యూఆర్ : 8 పోస్టులు
ఈడబ్ల్యూఎస్ : ఒక పోస్టు
ఓబీసీ : 3 పోస్టులు
ఎస్సీ : 2 పోస్టులు
ఎస్టీ : 1 పోస్టు
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 25
విద్యార్హత: డిగ్రీతో పాటు డిప్లొమా లేదా పీజీ డిగ్రీ లేదా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా హాస్పిటల్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వేతనం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.71 వేల జీతం ఉంటుంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 45 ఏళ్ల వయస్సు మించరాదు. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ లకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉండును. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉండును.
ఉద్యోగ ఎంపిక విధానం: స్క్రీనింగ్/ షార్ట్‌లిస్ట్/ సెలక్షన్ టెస్ట్/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగురాలు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.