Pahalgam Terror Attack : పహల్‌గామ్ ఉగ్రదాడితో యావత్ దేశం విషాధంలో మునిగిపోయింది. 28 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ముష్కరుల కోసం ఆర్మీ వేట కొనసాగుతోంది. టెర్రర్ అటాక్‌ను అన్నివర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ ఉగ్రదాడికి చలించిపోయారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. వారికి గౌరవ సూచకంగా, సంఘీభావంగా పార్టీ తరఫున తెలుగు రాష్ట్రాలలో 3 రోజుల సంతాప దినాలను ప్రకటించారు. జనసేన జెండా సగం ఎత్తులో ఎగురుతుందని తెలిపారు.
అధిగమిద్దాం.. కోలుకుందాం..
దారుణమైన పహల్‌గామ్ దాడి తీవ్రంగా కలచివేసిందన్నారు జనసేనాని. భారత ఐక్యతను ఉగ్రవాదం విచ్ఛిన్నం చేయలేదన్నారు. సమష్టిగా, మనం దీనిని అధిగమిద్దామని.. కలిసి, మనం కోలుకుందామని.. పిలుపు ఇచ్చారు పవన్ కల్యాణ్.
సంతాప దినాలు.. క్యాండిల్ ర్యాలీ..
కాల్పుల్లో మరణించిన పర్యాటకులను స్మరించుకునేందుకు మూడు రోజుల పాటు JSP కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.. ఏప్రిల్ 25 సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీలు, మానవహారాలు ఏర్పాటు చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు సేనాని.
The horrific Pahalgam attack has deeply shaken us. My heart goes out to the bereaved families. As a mark of respect & solidarity, JanaSena will observe 3 days of mourning across the Telugu States. Our party flag will fly at half-mast.
In this dark hour, we remain resolute; Our… pic.twitter.com/TdVd9pTEsn— Pawan Kalyan (@PawanKalyan) April 23, 2025
Also Read : పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ 2 జరగాల్సిందే..
నిజమైన దేశభక్తుడు..
పవన్ కల్యాణ్. నిఖార్సైన దేశభక్తుడు. యే మేరా జహా.. తేరా కామ్ క్యా హై యహా.. అంటూ ఖుషీ సినిమాలో దేశభక్తిని రగిల్చారు. తన ప్రసంగాల్లో తరుచూ దేశం గురించి మాట్లాడుతుంటారు. పహల్‌గామ్ ఉగ్ర దాడి గురించి తెలిసి జనసేనాని తీవ్ర విచారణలో మునిగిపోయారని సన్నిహితులు చెబుతున్నారు. పవన్ చాలా సెన్సిటివ్, ఎమోషనల్. అంతే స్ట్రాంగ్ కూడా. సనాతన ధర్మం.. దేశం.. ప్రజలు.. ఈ మూడే ఆయనకు అన్నిటికంటే ముఖ్యం. అందుకే తిరుమల లడ్డూ కల్తీ అయిన విషయం తెలిసి.. ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. లడ్డూ ప్రసాదంలో కొవ్వు కలవడంతో.. తన తప్పేమీ లేకున్నా.. ఒక భక్తునిగా దేవుడిని క్షమాపణలు కోరుకుంటూ దీక్ష పూనారు. ఇప్పుడు కశ్మీర్‌లో టెర్రర్ అటాక్ గురించి తెలిసి కూడా అంతే చలించిపోయారని అంటున్నారు. మూడు రోజుల సంతాప దినాలతో పాటు పార్టీ జెండా సగం ఎత్తుకు అవనతం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్యాండిల్ ర్యాలీ, మానవ హారాలతో పార్టీ తరఫున ప్రత్యేక కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. దేశం కోసం.. దేశ ప్రజలను ఏకం చేసేలా జనసేన తనవంతుగా కదం తొక్కబోతోంది.
చంద్రబాబు సంతాపం
ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. ఉగ్రవాదం, హింస ద్వారా లక్ష్యాలేవీ సాధించలేరని మండిపడ్డారు. ఉగ్రవాద చర్య సమాజంపై మాయని మచ్చి అన్నారు. ఈ ఘాతుకానికి తెగబడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సర్కారు తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. టెర్రరిస్టుల అటాక్‌లో ప్రాణాలు కోల్పోయిన తెలుగువారైన చంద్రమౌళి, మధుసూదన్‌లకు సంతాపం ప్రకటించారు సీఎం చంద్రబాబు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Mourning the tragic loss of Sri JS Chandramouli Garu and Sri Madhusudhan Garu, members of our Telugu community, who lost their lives in yesterday’s terrorist attack in Pahalgam. Our thoughts and prayers are with their families during this time of profound grief, and I pray they…
— N Chandrababu Naidu (@ncbn) April 23, 2025