E-Paper
Advertisement

NTPC Limited: బీటెక్ అర్హతతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. అక్షరాల రూ.2,00,000 జీతం

NTPC Limited: బీటెక్ అర్హతతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. అక్షరాల రూ.2,00,000 జీతం
Advertisement

NTPC Limited: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎన్టీపీ లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్లుండి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయి. బీటెక్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

ఎన్టీపీసీ లిమిటెడ్ (ఎన్టీపీసీ) నుంచి మెకానికల్, ఎలక్ట్రికల్‌, సీ&ఐ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారుజూన్‌ 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 150

ఎన్టీపీసీ లిమిటెడ్ లో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, సీ అండ్ ఐ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.  ఇందులో వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్), డిప్యూటీ మేనేజర్ (మెకానికల్), డిప్యూటీ మేనేజర్ (సీ అండ్ ఐ) విభాగాల్లో ఉద్యోగాలున్నాయి.

Advertisement

పోస్టులు – వెకెన్సీలు: 

డిప్యూటీ మేనేజర్‌(ఎలక్ట్రికల్): 40
డిప్యూటీ మేనేజర్‌(మెకానికల్‌): 70
డిప్యూటీ మేనేజర్‌(సీ&ఐ): 40

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 26

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 9

వయస్సు: 40 ఏళ్లు మించరాదు. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

జీతం: ఉద్యోగానికి ఎంపికైన వారికి రూ.70వేల నుంచి రూ.2లక్షల వరకు వేతనం ఉంటుంది.

నోటిఫికేషన్ కు సంబందించిన పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://careers.ntpc.co.in

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మంచి జీతం ఉంటుంది.

ALSO READ: NMDC Notification: హైదరాబాద్ NMDC‌లో 995 ఉద్యోగాలు.. జీతం రూ.35,040, ఈ అర్హత ఉంటే చాలు!

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం వెకెన్సీల సంఖ్య: 150

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 9

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×