Pawan Kalyan: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూస్తారు. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి అమంతం పెరిగిపోయింది. ప్రతి సినిమా కూడా కొన్ని కోట్లు కొల్లగొడుతుంది. అయితే గత ప్రభుత్వంలో తెలుగు సినిమా పరిశ్రమ పరిస్థితి దీనంగా తయారయింది. ముఖ్యంగా సినిమా టికెట్ ధరల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఈ విషయంపై నాని, పవన్ కళ్యాణ్ వంటి నటులు మాట్లాడి టార్గెట్ గా మారారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన
•తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు
•ఆంధ్రప్రదేశ్ లో ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా?
•గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో మరచిపోయినట్లున్నారు
•ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు… సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి
•కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు… సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే – తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు. అందరూ కలసి రావాలి అని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు సూచించినా సానుకూలంగా స్పందించలేదు.
వ్యాఖ్యలు వైరల్
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే దీనిపై తెలుగు సినిమా పరిశ్రమ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో థియేటర్లు మూసి వేస్తారు అనే వార్తలుకు కూడా, దానిని వాయిదా వేస్తున్నట్లు ఒక అధికారిక ప్రకటనతో చెక్ పెట్టారు కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్.
Also Read : Manchu Manoj: అందుకే మా అక్క నాకోసం నిలబడలేదు