BigTV English
Advertisement

Court Jobs: అద్భుతమైన అవకాశం.. భారీగా కోర్టు ఉద్యోగాలు.. ఏడో తరగతి నుంచి అర్హత స్టార్ట్..

Court Jobs: అద్భుతమైన అవకాశం.. భారీగా కోర్టు ఉద్యోగాలు.. ఏడో తరగతి నుంచి అర్హత స్టార్ట్..

Court Jobs: ఏపీ రాష్ట్ర నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1620 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో అత్యధికంగా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. జానియర్ అసిస్టెంట్ పోస్టులు 230 ఖాళీగా ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, టైపింగ్ సర్టిఫికెట్ ఇలా ఉద్యోగాన్ని బట్టి క్వాలిఫికేషన్ ను నిర్ణయించారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.


కూటమి సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా పలు కోర్టుల్లో మొత్తం 1620 ఉద్యోగాలను భర్తీ చేసేందకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు అఫీషియల్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. మే 13వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతోంది. జూన్ 2న దరఖాస్తు గడువు ముగియనుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1626


దరఖాస్తుకు ప్రారంభ తేది: మే 13

దరఖాస్తుకు చివరి తేది: జూన్ 2

విద్యార్హత: కాపీయిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్, డిగ్రీతో పాటు సంబంధిత విభాగంలో పాసై ఉండాలి. తప్పనిసరిగా టైపింగ్ వచ్చి ఉండటమే కాకుండా… కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.

ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు ఏడో తరగతి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ అర్హతగా నిర్ణయించారు.

దరఖాస్తు ఫీజు: ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.400 ఫీజు ఉంటుంది.

 పోస్టులు – వెకెన్సీలు:

జూనియర్ అసిస్టెంట్ – 230

 ఆఫీస్ సబార్డినేట్ – 651

ప్రాసెస్ సర్వర్ – 164

రికార్డు అసిస్టెంట్ – 24

కాపీయిస్ట్ – 193

ఎగ్జామినర్ – 32

ఫీల్డ్ అసిస్టెంట్ – 56

టైపిస్ట్ – 162

స్టెనోగ్రాఫర్ – 80

డ్రైవర్ – 28

వయస్సు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్లు ఉన్న వారికి వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం:  కోర్టు ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాల్డెజ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. కొన్ని ఉద్యోగాలకు స్కిల్ టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుంది. మార్కులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు.

ALSO READ: SBI Recruitment: ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టులు, ఇంకా 3 రోజులే సమయం

మీకు ఎలాంటి సందేహాలున్నా:  కోర్టు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే helpdesk-hc.ap@aij.gov.in కు మెయిల్ చేయండి. లేదా 0863-2372752 నెంబర్ ను అభ్యర్థులు సంప్రదించవచ్చు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో ఫోన్ కాల్ అందుబాటులో ఉంటుంది.

Related News

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం

SBI Notification: డిగ్రీ అర్హతతో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇలాంటి నోటిఫికేషన్ రేర్, జాబ్ వస్తే లైఫ్ అంతా సెట్

RITES Notification: డిగ్రీ, డిప్లొమా అర్హతతో భారీగా జాబ్స్.. ఉద్యోగ ఎంపిక విధానమిదే, ఇంకా వారం రోజులే

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.1,77,500 జీతం, టెన్త్, డిగ్రీ పాసైతే చాలు

PNB LBO: నిరుద్యోగులకు పండుగే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు బ్రో

SEBI JOBS: సెబీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.1,26,100 జీతం, దరఖాస్తు ప్రక్రియ షురూ

BEL Notification: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. బీటెక్ పాసైతే చాలు, జీతం అక్షరాల రూ.1,40,000

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. జిందగీలో ఇలాంటి జాబ్ కొట్టాలి భయ్యా.. లైఫ్ అంతా సెట్

Big Stories

×