BigTV English

Kavitha : కవిత పాదయాత్ర? ఆ తర్వాత…!

Kavitha : కవిత పాదయాత్ర? ఆ తర్వాత…!

Kavitha : కవిత ఎపిసోడ్ కాక రేపుతోంది. కారులో కుంపటి రగులుతోంది. దెయ్యాలపై చర్చ నడుస్తోంది. కోటరీలు, కోవర్టులపై రచ్చ జరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీలు కవిత ఎపిసోడ్‌తో ఆటాడుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా.. ఇంటి దొంగలు మాత్రం బయటపడటం లేదు. కూతురుతో తండ్రి మాట్లాడలేదు.. చెల్లితో అన్న చర్చించలేదు. డాడీని డాటర్ కలవలేదు.. అన్నను కవితక్క మీట్ అవలేదు. వాళ్ల మధ్య మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్. ఎందుకు? అసలేం జరుగుతోంది? కవిత కన్ఫ్యూజ్ చేస్తున్నారా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? పార్టీలోనే ఉంటారా? పార్టీని వీడుతారా? కొత్త పార్టీతో కవిత సరికొత్త రాజకీయం షురూ చేస్తారా? తెలంగాణలో ఇదే హాట్ టాపిక్.


కేటీఆర్‌కు కవిత సపోర్ట్ అందుకేనా?

తనపై కుట్ర చేస్తున్నారని ఒకసారి.. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఇంకోసారి. కవిత వరుసగా అటాక్ చేశారు. కేసీఆర్‌తో టచ్‌లో ఉండేది కేటీఆర్, సంతోష్‌రావు, హరీశ్‌రావులు మాత్రమే. ఆ ముగ్గురిలో ఒకరు దెయ్యమా? ఈ ఇష్యూలో హరీశ్‌రావు సైడ్ అయిపోయారు. సో ఆయన్ను ఎలిమినేట్ చేస్తే మిగిలేది కేటీఆర్, సంతోష్‌రావులే అంటున్నారు. కేటీఆర్, కవితల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ కుట్రదారు కేటీఆరే అంటున్నారు. కానీ, సడెన్‌గా కవిత తన ట్వీట్‌తో ట్విస్ట్ ఇచ్చారు. ఫార్ములా ఇ కారు రేసులో కవితకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. అన్నకు నోటీసులపై చెల్లి స్పందించారు. రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని.. తట్టుకుని నిలబడతామంటూ కేటీఆర్‌కు ఫుల్ సపోర్ట్‌గా నిలిచారు కవిత.


కవిత వ్యూహం ఇదేనా?

కవిత ట్వీట్ వెనుక వ్యూహం దాగుందా? కేసీఆర్ షంటింగ్స్‌తోనే కవిత దారికొచ్చారా? అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అన్నాచెల్లిల మధ్య గొడవలంటూ ప్రచారం జరుగుతున్న టైమ్‌లో.. గతానికి భిన్నంగా ఇలా పబ్లిక్ అందరికీ తెలిసేలా ఎక్స్‌లో పోస్ట్ పెట్టడం కాకతాళీయం కాకపోవచ్చు అంటున్నారు. కేటీఆర్, కవితల మధ్య లొల్లి లేదనేలా మెసేజ్ ఇచ్చేందుకే అలా చేశారని చెబుతున్నారు. లేదంటే, జరుగుతున్న డ్యామేజ్‌తో కంగారుపడిన కవిత.. పరిస్థితిని కాస్త కూల్ ఆఫ్ చేసేందుకైనా ఇలా చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అన్నతో మరీ తెగేదాకా లాగొద్దు అనుకుంటున్నారేమో అంటున్నారు. కేసీఆర్ జోక్యం కారణం కావొచ్చని కూడా భావిస్తున్నారు.

Also Read : చర్చలు ఫెయిల్.. కవిత ఫ్యూచరేంటి?

త్వరలోనే కవిత పాదయాత్ర?

అయితే, ఆ మర్నాడే కవిత మరో కీలకమైన పని చేశారు. కవిత నాయకత్వంలో ‘సింగరేణి జాగృతి’ ఆవిర్భావం జరిగింది. సింగరేణిలో 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియమించారు. త్వరలోనే కవిత బీఆర్ఎస్ జెండా వదిలేసి.. జాగృతి ఎజెండా అందుకుంటారని అంటున్నారు. ప్రస్తుతం TGBKSకు కవిత గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. BRSకు TGBKS అనుబంధంగా ఉంది. TGBKS ఉన్నా, సింగరేణి జాగృతి పేరుతో కవిత ఎందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారనే చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ నుంచి కవిత దూరం జరుగుతున్నారా? కొత్త పార్టీ పెట్టడంలో భాగంగానే జాగృతిని విస్తృత పరుస్తున్నారా? తెలంగాణ జాగృతిని రాయకీయ పార్టీగా మార్చుతారా? సింగరేణి జాగృతి అందులో మొదటి అడుగా? అని.. BRS శ్రేణులు చర్చించుకుంటున్నాయి. జూన్ 2న కవిత కొత్త పార్టీ పెడతారంటూ బలమైన ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత కవిత తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేయొచ్చని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. అదే జరిగితే.. కారులో మరింత కల్లోలం తప్పకపోవచ్చు. కవిత మరో షర్మిల అవుతారనే ప్రచారం నిజమూ కావొచ్చు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×