RRB NTPC: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.. ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇంటర్, డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, పోస్టులు, వెకెన్సీలు, దరఖాస్తు విధానం, జీతం, వయస్సు తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నోట్: దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ అయ్యింది. (నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ప్రకటించనున్నారు.)
ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ నుంచి 8,850 స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ తదితర ఉద్యోగాలను భర్త చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 20న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 8850
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్ (మెట్రో రైల్వే), చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియ్ క్లర్క్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
డిగ్రీ క్వాలిఫికేషన్..
స్టేషన్ మాస్టర్ : 615 పోస్టులు
గూడ్స్ ట్రైన్ మేనేజర్: 3423 పోస్టులు
ట్రాఫిక్ అసిస్టెంట్ (మెట్రో రైల్వే): 59 పోస్టులు
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్: 161 పోస్టులు
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 921 పోస్టులు
సీనియ్ క్లర్క్ టైపిస్ట్: 638 పోస్టులు
ఇంటర్ క్వాలిఫికేషన్..
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 163 పోస్టులు
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 394 పోస్టులు
ట్రైన్ క్లర్క్: 77 పోస్టులు
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2424 పోస్టులు
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ క్వాలిఫికేషన్ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఇంటర క్వాలిఫికేషన్ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ప్రారంభ వేతనం రూ.35,400 వరకు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 21
దరఖాస్తుకు చివరి తేది : 2025 నవంబర్ 27
ఎగ్జామ్ డేట్స్ : త్వరలో ప్రకటించనున్నారు..
అఫీషియల్ వెబ్ సైట్: https://www.rrbcdg.gov.in/