Miyapur: హైదరాబాద్ మియాపూర్‌లో అక్రమ నిర్మాణలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. మియాపూర్‌లోని 100 సర్వే నెంబర్‌లో భారీ అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తోంది. సర్వే నెంబర్ మార్చేసి అక్రమంగా నిర్మాణం జరిపారని ఫిర్యాదులు వచ్చాయి. HMDA వేసిన ఫెన్సింగ్ తొలగించి అక్రమ నిర్మాణం చేపట్టడంపై ఫిర్యాదులు వచ్చాయి. అమీన్‌పూర్ మున్సిపాలిటీ సర్వేనెంబర్ 307,308ల్లో పర్మిషన్ తీసుకుని సర్వే నెంబర్100లో నిర్మాణం చేపట్టారు. బాహుబలి క్రేన్ సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు.