Chia Seed Water: చియా సీడ్స్ ఆరోగ్యానికి మేలు చేసే సూపర్ ఫుడ్. ఇవి మెక్సికో, గ్వాటెమాలా వంటి దేశాల్లో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అంతే కాకుండా జీర్ణక్రియ మెరుగవుతుంది. బరువు తగ్గడానికి కూడా ఇది సహాయ పడుతుంది.
ఇదిలా ఉంటే చాలా మందిలో ఉండే ఒక సందేహం ఏంటంటే.. ఉదయమా లేక సాయంత్రమా దీన్ని తాగడం మంచిది ? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చియా సీడ్స్ వాటర్.. ఎలా తయారు చేసుకోవాలో ముందుగా తెలుసుకుందాం. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ చియా గింజలు వేసి 15-20 నిమిషాలు నానబెట్టండి. గింజలు నీటిని తీసుకుని జెల్ లాగా మారతాయి. ఇందులో నిమ్మరసం, తేనె లేదా పండ్ల రసం కలిపి రుచికరంగా తాగవచ్చు.
ఉదయం తాగడం ఎందుకు మంచిది ?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో చియా సీడ్స్ వాటర్ తాగితే శరీరం రోజంతా ఎనర్జీతో నిండిపోతుంది. చియా గింజల్లోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పని తీరును మెరుగు పరుస్తాయి. అంతే కాకుండా రోజువారీ పనులకు సహాయ పడతాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఉదయం తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం.. చియా సీడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. డయాబెటిస్ రోగులకు మేలు చేస్తాయి. ఉదయం తాగితే మెటబాలిజం వేగవంతమవుతుంది. అంతే కాకుండా కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి.
హైడ్రేషన్ కోసం ఉదయం ఉత్తమం – రాత్రి నిద్రలో శరీరం నీటిని కోల్పోతుంది. దీన్ని తిరిగి నింపుకోవచ్చు.
Also Read: మహిళల్లో హార్ట్ ఎటాక్ లక్షణాలు.. ఎలా ఉంటాయంటే ?
సాయంత్రం తాగడం ఎందుకు మంచిది ?
సాయంత్రం లేదా రాత్రి భోజనం తర్వాత చియా సీడ్స్ వాటర్ తాగితే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. రోజంతా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, బ్లోటింగ్ సమస్యలు తగ్గుతాయి. చియా గింజల్లోని ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్ నిద్రను మెరుగుపరుస్తుంది. సెరోటోనిన్ హార్మోన్‌ను పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన ఉన్నవారికి సాయంత్రం తాగితే మంచి నిద్ర వస్తుంది.
బరువు నియంత్రణకు కూడా సాయంత్రం సహాయకరం – రాత్రి ఆకలి అదుపులో ఉంటుంది. అనవసర ఆహారం తినకుండా చూస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం.. చియా సీడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతే కాకుండా కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. సాయంత్రం తాగితే రాత్రి శరీరం రిపేర్ అవుతుంది.
ఉదయమా సాయంత్రమా – ఏది బెస్ట్ ?
ఇది మీ లైఫ్ స్టైల్ ఆధారపడి ఉంటుంది. ఉదయం తాగితే ఎనర్జీ, మెటబాలిజం బూస్ట్ అవుతాయి. ఆఫీసులకు వెళ్లేవారు, వ్యాయామం చేసేవారికి ఇది బెస్ట్. రిలాక్సేషన్, మంచి నిద్ర, ఒత్తిడి ఉద్యోగులు, నిద్ర సమస్యలున్నవారు సాయంత్రం తాగితే సూటబుల్.