Union Bank of India Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా ఉంటుంది. ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఏం, పీజీడీబీఏ, పీజీడీఎంలో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి భారీ సాలరీ కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వెంటనే ఫటా ఫట్ అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మొత్తం పోస్టులు, వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, తదితర వాటి గురించి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబైలో 250 వెల్త్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఆగస్ట్ 5న దరఖాస్తు ప్రారంభమైంది. ఆగస్టు 25న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 250
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం 250 వెల్త్ మేనేజర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు
వెల్త్ మేనేజర్: 250 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంబీఏ/పీజీడీఎం, పీజీడీబీఎం, పీజీడీబీఏ, పీజీడీఎంలో పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
ముఖ్యమైన తేదీలు….
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 5
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 25
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 25 ఏళ్ల నుంచి 35 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.68,820 నుంచి రూ.93,960 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.unionbankofindia.co.in/
అప్లికేషన్ లింక్: https://ibpsonline.ibps.in/ubiwmjul25/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అప్లికేషణ్ లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్త ఉద్యోగ ఖాళీల సంఖ్య: 250
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 25
జీతం: రూ.68,820 నుంచి రూ.93,960 జీతం ఉంటుంది.