Udaya Bhanu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ యాంకర్ గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఉదయభాను(Udaya Bhanu) ఒకరు. ఒకానొక సమయంలో ఏదైనా సినిమా వేడుక జరిగినా లేదంటే బుల్లితెరపై ఒక కార్యక్రమం ప్రసారమైన ఆ కార్యక్రమంలో యాంకర్ గా ఉదయభాను సందడి చేసేవారు. అప్పట్లో ఈమె క్షణం తీరిక లేకుండా గడిపేవారు. అయితే ఇండస్ట్రీ లోకి కొత్తవాళ్ల వచ్చిన తరువాత పాత వారికి అవకాశాలు తగ్గుతాయనే మాట వాస్తవమే. ఇక ఉదయభాను విషయంలో కూడా అదే జరిగింది ఇండస్ట్రీకి కొత్త యాంకర్లు పరిచయం కావడంతో ఉదయభానుకు కూడా క్రమక్రమంగా అవకాశాలు రావడం తగ్గిపోయాయి.
సిండికేట్ పెరిగిపోయింది…
ఇక పెళ్లి తర్వాత ఈమె ప్రెగ్నెంట్ కావడం, కవల పిల్లలకు జన్మనివ్వడం వంటి కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. దీంతో ఉదయభానుకు పెద్దగా అవకాశాలు లేవనే తెలుస్తోంది. ఇకపోతే ఉదయభాను ఇటీవల ఓ సినిమా వేడుకకు యాంకర్ గా వ్యవహరించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఇండస్ట్రీలో పెద్ద సిండికేట్(Syndicate) పెరిగిపోయిందని, యాంకర్లను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారనే ఉద్దేశంతో ఈమె మాట్లాడారు. అయితే ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. ఇండస్ట్రీలో ఉదయభానుకు అవకాశాలు రాకుండా తొక్కేస్తుంది ఎవరనే విషయంపై కూడా సందేహాలను వ్యక్తం చేశారు.
నిజంగానే తొక్కేశారా?
ఇక ఉదయభాను చేసిన ఈ వ్యాఖ్యల పట్ల పలువురు నిర్మాతలు కూడా మాట్లాడుతూ ఈమె వ్యాఖ్యలను ఖండించారు. అయితే త్వరలోనే ఉదయభాను ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbarik) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఆగస్టు 22వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఉదయభానుకు ఇదే విషయం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ ఈమెను ప్రశ్నిస్తూ మీరు యాంకర్లకు అవకాశాలు రాకుండా తొక్కేస్తున్నారు అంటూ మాట్లాడారు నిజంగానే అలాంటివి జరుగుతున్నాయా? అంటూ ప్రశ్న వేశారు.
నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతాను..
ఈ ప్రశ్నకు ఉదయభాను సమాధానం చెబుతూ.. నేనెప్పుడూ మాట్లాడిన నిజాలే మాట్లాడతాను అంటూ ఈమె ఇండస్ట్రీలో యాంకర్లను తొక్కేస్తున్నారని చెప్పకనే చెప్పేశారు. అయితే రిపోర్టర్ మరో ప్రశ్న వేయబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సందర్భం ఇది కాదు అంటూ ఆ ప్రశ్నలను దాటి వేసే ప్రయత్నం చేశారు. కానీ నేను నిజాలే మాట్లాడతానని ఎవరిని కదిలించినా నిజాలే మాట్లాడుతారు అంటూ ఈ సందర్భంగా ఉదయభాను చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చలకు కారణమయ్యాయి. అయితే ఇటీవల కాలంలో సినిమాలకు ఉదయభాను కాకుండా ఎక్కువగా సుమ కనకాల(Suma Kanakala) యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఏ సినిమా వేడుక జరిగిన సుమ కనకాల యాంకర్ గా కనిపిస్తున్నారు. ఇక ఉదయభాను తన వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇవ్వడంతో ఆ గ్యాప్ సుమ పూర్తిచేసి ప్రస్తుతం ఆమె ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
Also Read: Udaya Bhanu: ఉదయభానుకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్… బయటపెట్టిన యాంకరమ్మ!