Indian Navy: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.. ఇండియన్ నేవీలో ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.. బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఈ, ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్‌బీ, ఎమ్మెస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇండియన్ నేవీ నుంచి 260 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ కసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 260
ఇండియన్ నేవీలో ఎస్ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
ఉద్యోగాలు – వెకెన్సీలు…
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ : 57 పోస్టులు
పైలట్: 24 పోస్టులు
నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ : 20 పోస్టులు
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ : 10 పోస్టులు
నావల్ ఆర్మమెంట్ ఇన్ స్పెక్టరేట్ కేడర్ : 20 పోస్టులు
లా : 2 పోస్టులు
ఎడ్యుకేషన్ : 15 పోస్టులు
ఇంజినీరింగ్ బ్రాంచ్ : 36 పోస్టులు
ఎలక్ట్రికల్ బ్రాంచ్ : 40 పోస్టులు
నావల్ కన్ స్ట్రక్టర్: 16 పోస్టులు
విద్యార్హత: బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఈ, ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్‌బీ, ఎమ్మెస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులతో పాసై ఉండాలి
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 9
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 1
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. ప్రారంభ వేతనమే రూ.1,10,000 వరకు ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, ఇంకా ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.joinindiannavy.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. ప్రారంభ వేతనమే రూ.1,10,000 వరకు ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా.. ఆగస్టు 9న ప్రారంభమయ్యే ఈ అప్లికేషన్ ప్రక్రియకు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 260
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 1
ALSO READ: OICL Recruitment: ఇంటర్ పాసైతే ఎనఫ్.. చాలా తక్కువ పోటీ.. నెలకు రూ.62వేల జీతం