NICL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన ఉద్యోగాలు, వెకెన్సీలు, విద్యార్హత, వయస్సు, ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందాం.
భారత ప్రభుత్వ పబ్లిక్ రంగ సంస్థ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) 2025-26 సంవత్సరానికి గాను జనరలిస్ట్, స్పెషలిస్ట్ స్కేలు-I అధికారులుగా పనిచేసేందుకు 266 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జూన్ 12 నుంచి జులై 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 266
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో జనరలిస్ట్, డాక్టర్లు, లీగల్, ఫైనాన్స్ తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
ఉద్యోగాలు – వెకెన్సీలు:
1. జనరలిస్ట్: 170
2. డాక్టర్లు (ఎంబీబీఎస్): 14
3. లీగల్: 20
4. ఫైనాన్స్: 21
5. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 20
6. ఆటోమొబైల్ ఇంజినీర్లు: 21
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీకామ్, బీటెక్/బీఈ, ఎంబీబీఎస్, పీజీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంకామ్, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్/ఎండీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 2025 మే 1 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 31 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన వారికి భారీ జీతం ఉంటుంది. నెలకు రూ.50,925 నుంచి రూ.90,000 జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. (దరఖాస్తు చేసే ముందు అవసరమైన సర్టిఫికెట్లను రెడీ చేసి పెట్టుకోవాలి)
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 12
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూలై 3
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, డీడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://nationalinsurance.nic.co.in/
ALSO READ: ఎస్ఎస్‌సీలో 14,582 ఉద్యోగాలు, ఈ జాబ్ వస్తే భారీగా జీతం
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 266
దరఖాస్తుకు చివరి తేది: జూలై 3