Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రస్తుతం ఆరుపదుల వయసులో కూడా ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. బాలకృష్ణ ఒకప్పుడు హిట్ ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు కానీ ఇటీవల కాలంలో మాత్రం బాలయ్య చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్లను రాబట్టడం విశేషం. ఇలా బాలకృష్ణ ఇటీవల కాలంలో చేస్తున్న సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. మరోవైపు రాజకీయాల పరంగా కూడా బాలయ్య ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన గత మూడుసార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ భారీ మెజారిటీని సొంతం చేసుకున్నారు.
పునర్జన్మ అందిస్తూ…
సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాలలో కూడా అపజయం లేకుండా దూసుకుపోతున్న బాలయ్య ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఎన్నో అద్భుతమైన సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ తల్లి బసవతారకం గారు క్యాన్సర్ తో బాధపడుతూ మరణించారు. తన తల్లిలాగా ఎవరు మరణించకూడదన్న ఉద్దేశంతోనే బసవతారకం హాస్పిటల్ (Basavatharakam Hospital)ని ప్రారంభించారు. ఈ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది క్యాన్సర్(Cancer) పేషెంట్లు చికిత్స చేయించుకుంటూ పునర్జన్మను పొందుతున్నారు. ఇక బాలయ్య కూడా ఈ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి ఉచితంగా వైద్యం చేయిస్తూ మంచి మనసును చాటుకున్నారు.
ఉచితంగా వైద్యం..
ఇలా బసవతారకం హాస్పిటల్ కోసం బాలకృష్ణ ఎంతో చేస్తున్నారని చెప్పాలి ఆయన సినిమాల ద్వారా సంపాదించింది కొంత మొత్తం బసవతారకం హాస్పిటల్ కోసమే ఖర్చు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా బాలకృష్ణ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తికి ఉచితంగా వైద్యం చేయించడంతో బాలయ్య మంచి మనసు మరోసారి బయటపడింది. ఇటీవల బాలకృష్ణ తన సినిమా షూటింగ్ పనుల నిమిత్తం హంసల వీధికి వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి షూటింగ్లో ఉన్న బాలయ్య వద్దకు వెళ్లి తన అనారోగ్య సమస్యలను చెప్పుకున్నారు.
తాను నిరుపేద కుటుంబంలో నివసిస్తున్నారని ఇటీవల క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తన బాధను మొత్తం బాలకృష్ణ వద్ద చెప్పుకున్నారు. ఇలా ఆ వ్యక్తి బాధ విన్న బాలయ్య వెంటనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లోని డాక్టర్ కి ఫోన్ చేసి డాక్టర్ తో ఆయన మాట్లాడమే కాకుండా క్యాన్సర్ పేషెంట్ అతని కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించి తనకు ధైర్యం చెప్పారు. అలాగే బసవతారకం హాస్పిటల్ లో పూర్తిగా వైద్యాన్ని ఉచితంగా చేయిస్తామని హామీ ఇచ్చారు. బాలయ్య సూచనలతో ఆ వ్యక్తి క్యాన్సర్ చికిత్స చేయించుకుంటున్నారని తెలుస్తుంది. ఇలా ఈ విషయం బయటపడటంతో బాలయ్య మంచి మనసు తెలిసి, ఇలా సహాయం చేయడంలో మీకు ఎవరు సాటిరారు అంటూ అభిమానులు ఫిదా అవుతున్నారు. పెట్టేది ఆయనే.. కొట్టేది ఆయనే.. మంచి వాళ్లకు మంచి వ్యక్తిగా, చెడ్డ వాళ్లకు చెడ్డ వ్యక్తిగా కనిపిస్తారు అంటూ అభిమానులు బాలయ్య మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.