UNION BANK: నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్. ఇలాంటి సువర్ణవకాశం మళ్లీ మళ్లీ రాదు. ఇటీవల 2691 అప్రెంటీస్ పోస్టులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దరఖాస్తు తేదిని పొడిగించింది. మార్చి 12 వరకు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగ అభ్యర్థులకు ఇలాంటి అవకాశం రాదు. ఇప్పుడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. యూనియన్ బ్యాంకులో దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇందులో ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ కూడా కల్పించనున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.15,000 స్టైఫండ్ ఇస్తారు. ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. వెంటనే ఆన్ లైన్ లో ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.
యూనియన్ బ్యాంక్(UNION BANK) ముంబయి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకీ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 12వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసేద్దాం.
ALSO READ: SBI Recruitment: SBIలో 1194 ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా వారం రోజులే గడువు
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2691
యూనియన్ బ్యాంకులో భారీగా అప్రెంటీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఈ అప్రెంటీస్ పోస్టులు పలు రాష్ట్రాల్లో వెకెన్సీ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా వెకెన్సీలు..
తెలంగాణ: 304
ఆంధ్రప్రదేశ్: 549
కర్ణాటక: 305
తమిళనాడు: 122
కేరళ: 118
ఒడిశా: 53
మహారాష్ట్ర: 296
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు చివరి తేది: 2025 మార్చి 12
వయస్సు: 2025 ఫిబ్రవరి 1 వ తేది నాటికి 20 నుంచి 28 ఏళ్ల వయస్సు ఉండాలి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.unionbankofindia.co.in/
అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇంత మంచి అవకాశం మళ్లీ రాదు. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.1500 చొప్పున స్టైఫండ్ ఇస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ముఖ్యమైనవి:
మొత్తం పోస్టుల సంఖ్య: 2691
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 12