Manager Jobs: డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ, సీఎంఏ, ఎంబీఏ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఢిల్లీలోని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు. మార్చి 7 వరకు దరఖాస్తు గడువు ముగియనుంది
ఢిల్లీలోని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 29
ఇందులో వివధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టుల వారీగా..
జనరల్ మేనేజర్: 4 ఉద్యోగాలు
డిప్యూటీ జనరల్ మేనేజర్: 4 ఉద్యోగాలు
చీఫ్ మేనేజర్: 3 ఉద్యోగాలు
డిప్యూటీ మేనేజర్: 18 ఉద్యోగాలు
విద్యార్హత: ఉద్యోగాన్నిబట్టి డిగ్రీ, బీఈ/ బీటెక్, సీఏ/ సీఎంఏ, ఎంబీఏ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
జీతం: జనరల్ మేనేజర్‌కు నెలకు రూ.80,000- రూ.2,20,000; డిప్యూటీ జనరల్ మేనేజర్ కోసం రూ.70,000- రూ.2,00,000; చీఫ్ మేనేజర్‌కు రూ.60,000- రూ.1,80,000; డిప్యూటీ మేనేజర్‌కు రూ.40,000- రూ.1,40,000 వేతనం కల్పించనున్నారు.
వయస్సు: ఉద్యోగాని బట్టి వయస్సు ఉంటుంది. జనరల్ మేనేజర్ పోస్టుకు 45 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 41 ఏళ్లు, చీఫ్ మేనేజర్‌కు 38 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 31 ఏళ్ల వయస్సు మించరాదు.
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతలు, వర్క్ ఎక్స్ పీరియన్స్, ఇంటర్వ్యూ తదితర ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 7
Also Read: Welfare of Gig Workers: గిగి వర్కర్లకు ఇక నో టెన్షన్.. వారిపై కేంద్రం స్పెషల్ ఫోకస్
…………………………………………………………..
ఇండియన్ నావల్ అకాడమిలో 270 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
డిగ్రీ(బీఎస్సీ, బీకామ్,), పీజీ(ఎంసీఏ, ఎంఎస్సీ), బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించిన వారికి గుడ్ న్యూస్. కేరళలోని ఇండియన్ నావల్ అకాడమి(INA) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషణ్ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 25న దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 270
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, పైలట్, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్, తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టుల ఖాళీల వారీగా..
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్: 60
పైలట్: 26
నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్: 22
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్: 18
లాజిస్టిక్స్: 28
ఎడ్యుకేషన్: 15
ఇంజినీరింగ్ బ్రాంచ్: 38
ఎలక్ట్రికల్ బ్రాంచ్: 45
నావల్ కన్‌స్ట్రక్టర్: 18
విద్యార్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(బీఎస్సీ, బీకామ్,), పీజీ(ఎంసీఏ, ఎంఎస్సీ), బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,10,000 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 8
దరఖాస్తుకు చివరి తేది: 2025 పిబ్రవరి 25
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: http://https//www.joinindiannavy.gov.in/